Kishan Reddy: ₹900 కోట్ల విపత్తు నిధులను రాష్ట్ర ప్రభుత్వం వాడాలి: కిషన్‌ రెడ్డి

భూపాలపల్లి జిల్లాలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి పర్యటించారు. భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన మోరంచపల్లితో పాటు ఇతర గ్రామాల్లోని పరిస్థితిని పరిశీలించారు. 

Updated : 30 Jul 2023 17:06 IST

భూపాలపల్లి: వరద బాధితులకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి భరోసా ఇచ్చారు. భూపాలపల్లి జిల్లాలో ఆయన ఇవాళ పర్యటించారు. భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన మోరంచపల్లితో పాటు ఇతర గ్రామాల్లోని పరిస్థితిని పరిశీలించారు. వరద ఉద్ధృతికి దెబ్బతిన్న వంతెన, రహదారులను పరిశీలించి.. కలెక్టర్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. 

కేంద్ర బృందాలు రేపట్నుంచి వరద నష్టం వివరాలు సేకరిస్తాయని తెలిపారు. కేంద్రం, రాష్ట్రం కలిసి బాధితులను ఆదుకోవాలన్న కిషన్‌ రెడ్డి.. రాజకీయాలకు అతీతంగా బాధితులకు సాయం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న రూ.900 కోట్ల విపత్తు నిధులను వాడాలని సూచించారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం అందజేస్తామని.. ఇందులో కేంద్రం రూ.3 లక్షలు, రాష్ట్రం రూ.లక్ష ఇస్తుందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని