KTR: కేటీఆర్‌ అమెరికా పర్యటన.. దిగ్గజ సంస్థల ప్రతినిధులతో భేటీ

రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా (యూఎస్‌ఏ)లో పర్యటిస్తోన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, ఆయన బృందానికి వివిధ సంస్థల నుంచి అద్భుత....

Published : 26 Mar 2022 20:20 IST

న్యూయార్క్‌: రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా (యూఎస్‌ఏ)లో పర్యటిస్తోన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, ఆయన బృందానికి వివిధ సంస్థల నుంచి అద్భుత స్పందన వస్తోంది. ఇవాళ వరల్డ్ టాప్ ఫార్మా కంపెనీలతో కేటీఆర్‌ బృందం సమావేశమైంది. తెలంగాణలో ఫార్మా, లైఫ్ సైన్సెస్ సెక్టార్‌ను మరింత బలోపేతం చేసేలా ఫైజర్, జె అండ్ జె, జీఎఎస్‌కే వంటి దిగ్గజ కంపెనీలతో సమావేశమయ్యారు. ఈ సంస్థలు ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో భాగం కాగా.. వీటి వార్షిక ఆదాయం 170 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ మూడు కంపెనీల్లో 3 లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. అటువంటి దిగ్గజ కంపెనీలతో మంత్రి కేటీఆర్ సమావేశమై.. హైదరాబాద్ ఫార్మా గ్రోత్ స్టోరీలో భాగం కావాలని కోరారు.

ఈ సందర్భంగా కేటీఆర్ ఇచ్చిన ప్రెజెంటేషన్‌ను కంపెనీల ప్రతినిధులు అభినందించారు. తెలంగాణలో ఫార్మా, లైఫ్ సైన్సెస్ వృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పాటుపడుతున్న తీరును స్వాగతించారు. హైదరాబాద్ లైఫ్ సైన్సెస్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేలా భాగం కావాలని కేటీఆర్ ఇచ్చిన పిలుపునకు సానుకూలంగా స్పందించారు. 2023లో జరిగే బయో ఆసియా సదస్సులో పాల్గొనాలని కంపెనీల ప్రతినిధులను కేటీఆర్ ఆహ్వానించారు.





Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు