ISRO: ‘జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌14’ ప్రయోగం విజయవంతం.. కక్ష్యలోకి ఇన్సాట్‌-3డీఎస్‌

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది.

Updated : 17 Feb 2024 19:03 IST

శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌(శ్రీహరికోట) నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌14 వాహక నౌక .. ఇన్సాట్‌-3డీఎస్‌ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది. 18.46 నిమిషాల అనంతరం 2,275 కిలోల బరువు ఈ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇన్సాట్‌-3డీఎస్‌ను వాతావరణ పరిశీలనలను మెరుగుపరచడానికి, భూమి, సముద్ర ఉపరితలాలను పర్యవేక్షించడానికి రూపొందించారు. తద్వారా వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరుస్తుంది. ప్రస్తుతం కక్ష్యలోని ఇన్సాట్‌-3డీ, ఇన్సాట్‌-3డీఆర్‌ ఉపగ్రహాలతో కలిసి ఇది పనిచేస్తుంది. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు, సిబ్బందికి ఛైర్మన్‌ సోమనాథ్‌ అభినందనలు తెలిపారు. ఇన్సాట్‌-3డీఎస్‌తో భూ, సముద్ర వాతావరణంపై కచ్చితమైన సమాచారం అందుతుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని