Hyderabad Metro: ఆ సమయంలో ఎక్కడి మెట్రో రైలు అక్కడే..

స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం 11.30కి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో సామూహిక జాతీయ గీతాలాపన జరగనుంది.

Updated : 16 Aug 2022 09:29 IST

ఒక నిమిషం పాటు నిలిచిపోనున్న సేవలు

సామూహిక జాతీయ గీతాలాపనకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు

హైదరాబాద్‌: స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం 11.30కి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో సామూహిక జాతీయ గీతాలాపన జరగనుంది. హైదరాబాద్‌ అబిడ్స్‌లోని జనరల్‌ పోస్ట్‌ ఆఫీస్‌ (జీపీవో) సర్కిల్‌ వద్ద నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొననున్నారు. హైదరాబాద్‌లోని మెట్రో రైళ్లు సహా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీలు, అంగన్‌వాడీ కేంద్రాలు, విద్యాసంస్థలతో పాటు ప్రైవేటు సంస్థలు తదితర ప్రదేశాల్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రయాణికులు, వాహనదారులు సహా ప్రజలంతా సరిగ్గా 11.30కి ‘జనగణమన’ జాతీయ గీతాన్ని ఆలపించాలని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే పిలుపునిచ్చారు. దీని కోసం ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేసింది. పోలీసు శాఖకు పర్యవేక్షణ బాధ్యతను అప్పగించింది. 

మెట్రో రైలు స్టేషన్లలోనూ సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాలను నిర్వహిస్తున్నందున 11.30 గంటలకు ఒక నిమిషం పాటు ఎక్కడి మెట్రో రైలు అక్కడే నిలిపివేయనున్నారు. జాతీయ గీతాలాపన అనంతరం మెట్రో సేవలు తిరిగి ప్రారంభం కానున్నాయి. మైట్రో స్టేషన్లు, రైళ్లలో జాతీయ గీతాన్ని మెట్రో అధికారులు ప్లే చేయనున్నారు. మెట్రో రైళ్లు, స్టేషన్లలో ప్రయాణికులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని