Harish rao: దసరా నాటికి వరంగల్ హెల్త్‌ సిటీ నిర్మాణం పూర్తి చేయాలి: మంత్రి హరీశ్‌రావు

వరంగల్‌ హెల్త్‌ సిటీ, టిమ్స్‌ ఆసుపత్రులు, వైద్య కళాశాలల పురోగతి ఇతర అంశాలపై మంత్రి హరీశ్‌రావు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. 3 టిమ్స్‌ ఆస్పత్రులు, 8వైద్య కళాశాలల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు.

Published : 19 Apr 2023 22:28 IST

హైదరాబాద్‌: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న వరంగల్ హెల్త్ సిటీ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. దసరా నాటికి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రేటర్ పరిధితో పాటు, నగర శివారు ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు మరింత చేరువ చేసే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న సనత్ నగర్, ఎల్బీ నగర్, అల్వాల్ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలను సైతం వేగవంతం చేయాలని ఆదేశించారు. వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల పనులు పురోగతి, ఇతర అంశాలపై మంత్రి హరీశ్ రావు బుధవారం సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, కుటుంబ, సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతి, డీఎంఈ రమేశ్‌ రెడ్డి, డీహెచ్ శ్రీనివాసరావు, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, సీఎం ఓఎస్డీ గంగాధర్, అరోగ్య శ్రీ సీఈవో విషాలాక్షి, ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతి రెడ్డి సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. వరంగల్‌ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య పరికరాలు సమకూర్చనున్నట్టు తెలిపారు. మాడ్యులర్ థియేటర్లు, ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే అవకాశమే లేకుండా ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయాలన్నారు. దిల్లీ ఎయిమ్స్ తరహాలో టిమ్స్ సేవలు ఉండాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్న మంత్రి.. నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా కృషి చేయాలన్నారు. మరోవైపు 8 వైద్య కళాశాలల ఆసుపత్రుల నిర్మాణ పనులను సైతం త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు