ప్రతి జిల్లా కేంద్రంలో నీరా కేఫ్‌లు: శ్రీనివాస్‌గౌడ్‌

గతంలో ఏ ప్రభుత్వాలు గీత కార్మికులకు సాయం చేయలేదని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. తెరాస ప్రభుత్వం వచ్చాకే ఆదుకున్నామని తెలిపారు. ప్రమాదవశాత్తు మరణించినా,

Published : 08 Jul 2021 20:06 IST

హైదరాబాద్‌: గతంలో ఏ ప్రభుత్వాలు గీత కార్మికులకు సాయం చేయలేదని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. తెరాస ప్రభుత్వం వచ్చాకే ఆదుకున్నామని తెలిపారు. ప్రమాదవశాత్తు మరణించినా, గాయపడిన గీత కార్మికుల కుటుంబాలకు ‘కేసీఆర్‌ అభయ హస్తం’ పథకం కింద ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ రవీంద్ర భారతిలో బాధితులకు మంత్రి ఆర్థిక సాయం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.

‘‘గీత కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల పరిహారం చెల్లిస్తున్నాం. గౌడ యువకులకు రుణాలు ఇచ్చే ఆలోచన చేస్తున్నాం. రూ.20 కోట్లతో ట్యాంక్‌బండ్‌తో పాటు ప్రతి జిల్లా కేంద్రంలో నీరా కేఫ్‌లు ఏర్పాటు చేస్తాం. త్వరలో గౌడలకు డిజైన్‌తో కూడిన లూనాలు అందిస్తాం’’ అని మంత్రి అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని