Nara Bhuvaneshwari: ఎన్టీఆర్‌ సిద్ధాంతాలను ట్రస్ట్‌ పాటిస్తోంది: నారా భువనేశ్వరి

ఎన్టీఆర్ అంటేనే నిబద్ధత అని ‘ఎన్టీఆర్‌ ట్రస్ట్‌’ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) అన్నారు.

Published : 18 Jan 2024 12:36 IST

హైదరాబాద్‌: ఎన్టీఆర్ అంటేనే నిబద్ధత అని ‘ఎన్టీఆర్‌ ట్రస్ట్‌’ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) అన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆమె మాట్లాడారు.  

‘‘ఎన్టీఆర్‌ సిద్ధాంతాలను ట్రస్ట్‌ పాటిస్తోంది. ఆయన వర్ధంతికి ఏటా లెజెండరీ బ్లడ్‌ డొనేషన్‌ క్యాంపు నిర్వహిస్తున్నాం. మీరు ఇచ్చే ప్రతి రక్తపు బొట్టు.. మరొకరి జీవితంలో సంతోషాన్ని ఇస్తుంది. ట్రస్ట్‌ తరఫున రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్య, సామాజిక సేవ వంటి కార్యక్రమాలు చేపడుతున్నాం’’ అని భువనేశ్వరి అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని