NRI Yashasvi: లుక్‌ ఔట్‌ నోటీసు రద్దు చేయండి: హైకోర్టును ఆశ్రయించిన ఎన్‌ఆర్‌ఐ యశస్వి

తనపై సీఐడీ ఇచ్చిన లుక్‌ ఔట్‌ నోటీసును ఎత్తివేయాలని కోరుతూ ఎన్ఆర్‌ఐ యశస్వి (NRI Yashasvi) ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Published : 04 Jan 2024 17:52 IST

అమరావతి: తనపై సీఐడీ ఇచ్చిన లుక్‌ ఔట్‌ నోటీసును ఎత్తివేయాలని కోరుతూ ఎన్ఆర్‌ఐ యశస్వి (NRI Yashasvi) ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వ్యాజ్యంపై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్‌ను ఇప్పటికే సీఐడీ అరెస్టు చేసి 41ఏ నోటీసు ఇచ్చిందని న్యాయవాది ఉమేష్‌చంద్ర వాదనలు వినిపించారు. లుక్‌ఔట్‌ నోటీసు ఉద్దేశం నెరవేరిందని పేర్కొన్నారు. లుక్‌ఔట్‌ నోటీసు కారణంగా విదేశాలకు వెళ్లాలంటే పిటిషనర్‌కు ఇబ్బందులుంటాయని, ఈ నోటీసును కొట్టివేయాలని కోర్టును కోరారు. దీనిపై ఉన్నతాధికారుల సూచనలు తీసుకోవాలని సీఐడీకి న్యాయస్థానం సూచించింది. తదుపరి విచారణను ఈనెల 9కి వాయిదా వేసింది. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని యశస్విపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని