Pet parrot: ఆ చిలకను తెచ్చిన వారికి నగదు బహుమతి..

మనుషులు తప్పిపోయారన్న వార్తలు మనం తరచు టీవీల్లో, సోషల్‌ మీడియాల్లో చూస్తుంటాం. అడపాదడపా కుక్క తప్పిపోయిందన్న ప్రకటనలు చూస్తుంటాం.

Published : 06 May 2022 20:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మనుషులు తప్పిపోయారన్న వార్తలు మనం తరచూ టీవీల్లో, సోషల్‌ మీడియాల్లో చూస్తుంటాం. అడపాదడపా కుక్క తప్పిపోయిందన్న ప్రకటనలు చూస్తుంటాం. కానీ, ఓ కుటుంబం చిలుక తప్పిపోయిందని, దాన్ని ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతి ఇస్తామంటూ ప్రకటన చేశారు. అంతేకాదు చిలుక వివరాలు ఉన్న గోడ పత్రికను ఊరూవాడా అంతా అంటించారు. వివరాల్లోకి వెళితే..  బిహార్‌లోని గయా ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం 12 సంవత్సరాలుగా ఒక చిలుకను పెంచుకుంటున్నారు. నెల క్రితం అది పంజరంలో నుంచి ఎగిరిపోయింది. దానిని తిరిగి ఇంటికి తీసుకురావడం కోసం వాళ్లు దగ్గర్లోని చెట్ల దగ్గరకు వెళ్లి ప్రత్యేకమైన శబ్దం చేశారు. అయినా అది తిరిగి రాకపోవడంతో దాని వివరాలతో పోస్టర్ వేసి ఊరంతా అంటించారు. సామాజిక మాధ్యమాల్లోనూ పోస్ట్‌ చేశారు. ఆచూకీ చెప్పిన వారికి రూ.5,100 బహుమతి ఇస్తామని ప్రకటించారు. దాని యజమాని మాట్లాడుతూ.. ‘ మా చిలుక(పోపో) తప్పిపోయింది. దానిని మేము 12 సంవత్సరాల నుంచి ఇంట్లో మనిషి లాగా పెంచుకుంటున్నాము. దయచేసి అది ఎవరికైనా దొరికితే మాకు తెచ్చివ్వండి. బదులుగా మీకు మూడు చిలుకలు ఇస్తాము’. అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని