PM Modi: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకారం: ప్రధాని మోదీ

కేంద్రంలోని భాజపా ప్రభుత్వం దేశాభివృద్ధికి కృషి చేస్తోందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు.

Published : 04 Mar 2024 12:35 IST

ఆదిలాబాద్‌: కేంద్రంలోని భాజపా ప్రభుత్వం దేశాభివృద్ధికి కృషి చేస్తోందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. ఆదిలాబాద్‌లో రూ.7వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. రామగుండం ఎన్టీపీసీలో 800 మెగావాట్ల విద్యుత్‌ కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. దీంతో పాటు రైల్వే అభివృద్ధి పనులను ప్రారంభించారు.

‘‘దేశంలోని అనేక రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయి. తెలంగాణ ఏర్పడి పదేళ్లు అయింది. ఈ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుంది. పేదలు, దళితులు, ఆదివాసీల అభివృద్ధికి కృషి చేస్తుంది. గత పదేళ్లలో పేదరికం నుంచి 25 కోట్ల మంది బయటపడ్డారు’’ అని మోదీ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని