Bapatla: ‘సిద్ధం’ సభ కవరేజీకి వెళ్లొద్దు.. మీడియా సిబ్బందికి పోలీసుల నోటీసులు

మేదరమెట్లలో నేడు వైకాపా నిర్వహించనున్న ‘సిద్ధం’ సభ కవరేజీకి వెళ్లొద్దంటూ పలువురు మీడియా సిబ్బందికి బాపట్ల జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి నోటీసులు జారీ అయ్యాయి.

Updated : 10 Mar 2024 11:11 IST

బాపట్ల: మేదరమెట్లలో నేడు వైకాపా నిర్వహించనున్న ‘సిద్ధం’ సభ కవరేజీకి వెళ్లొద్దంటూ పలువురు మీడియా సిబ్బందికి బాపట్ల జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి నోటీసులు జారీ అయ్యాయి. వాటిని తీసుకోవాలంటూ మీడియా ప్రతినిధులకు స్థానిక పోలీసులు ఫోన్లు చేస్తున్నారు. ఎస్పీ కార్యాలయం నుంచి సెక్షన్‌ 149 నోటీసులు వచ్చాయని వారు చెబుతున్నారు. సభ కవరేజీకి వెళ్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీడియా సిబ్బందితో పాటు యూటీఎఫ్‌ నేతలు, తెదేపా నేతలు, కార్యకర్తలకూ జారీ చేశారు. కవరేజీకి వెళ్లొద్దంటూ నోటీసులు ఇవ్వడంపై మీడియా ప్రతినిధులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని