Varapula Raja: ప్రత్తిపాడు నియోజవర్గ తెదేపా ఇన్‌ఛార్జి హఠాన్మరణం

ప్రత్తిపాడు నియోజవర్గ తెదేపా ఇన్‌ఛార్జి వరపుల రాజా గుండెపోటుతో కన్నుమూశారు.

Updated : 05 Mar 2023 00:43 IST

ప్రత్తిపాడు: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి వరుపుల రాజా హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో కాకినాడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం రాత్రి  తుదిశ్వాస విడిచారు. ఇంట్లో హఠాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు అయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారని వైద్యులు వెల్లడించారు. రాజా గతంలో డీసీసీబీ ఛైర్మన్‌గా పని చేశారు. ఆయన మరణవార్త తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆస్పత్రికి చేరుకుంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు