Andhrapradesh News: విశాఖలో ప్రయోగాత్మకంగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటు

ప్రస్తుతం నెలకు వినియోగిస్తున్న యూనిట్ల మేరకే విద్యుత్తు బిల్లు మొత్తాన్ని నగదు, డిజిటల్ రూపంలో డిస్కంలకు చెల్లిస్తున్నాం.

Published : 05 Feb 2022 23:53 IST

విశాఖపట్నం: ప్రస్తుతం నెలకు వినియోగిస్తున్న యూనిట్ల మేరకే విద్యుత్తు బిల్లు మొత్తాన్ని నగదు, డిజిటల్ రూపంలో డిస్కంలకు చెల్లిస్తున్నాం. ఇకపై ముందుగానే డబ్బులు చెల్లించి.. సరిపడా విద్యుత్తును కొనుగోలు చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ప్రీపెయిడ్ మీటర్లను అందుబాటులోకి తెస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఐబోట్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రయోగాత్మకంగా ఈ మీటర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చింది. రాష్ట్రంలో తొలిసారి విశాఖలో ప్రయోగాత్మకంగా 100 చోట్ల ఈ స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేశారు. విశాఖ సర్కిల్ కార్యాలయంలోని జోన్-1 పరిధిలో.. 95 సింగిల్ ఫేజ్, 5 త్రీఫేజ్ కనెక్షన్లకు ఈ మీటర్లను అనుసంధానం చేసి పరీక్షిస్తున్నారు. బ్యాలెన్స్‌, రీఛార్జ్‌ సమాచారం వినియోగదారులకు చేరవేయడం లాంటి సాంకేతిక అంశాలను పరిశీలించడం సహా.. ప్రీపెయిడ్ మీటర్ల పనితీరును అంచనా వేసి ఉన్నతాధికారుల ఆదేశాలతో ముందుకు వెళ్తామని అధికారులు వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని