MLC Kavitha: కవిత అరెస్టుకు నిరసనగా భారాస శ్రేణుల ఆందోళన

భారాస ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా తెలంగాణలో పలు చోట్ల పార్టీ నేతలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.

Updated : 16 Mar 2024 11:33 IST

హైదరాబాద్‌: భారాస ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా తెలంగాణలో పలు చోట్ల పార్టీ నేతలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు రోడ్లపై బైఠాయించడంతో వాహన రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. కేంద్రం కుట్రపూరితంగా అరెస్టు చేయించిందని.. వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. మేడ్చల్‌ 44వ రహదారిపై రాస్తారోకో చేపట్టిన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్‌ చౌరస్తా, దుబ్బాక బస్టాండ్‌లో భారాస నేతలు నిరసన చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని