TDP: చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానికి తప్పిన ప్రమాదం

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నానికి త్రుటిలో ప్రమాదం తప్పింది.

Updated : 23 Mar 2024 17:55 IST

గుంటూరు: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును టిప్పర్‌ ఢీకొట్టింది. తెదేపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సార్వత్రిక ఎన్నికల సన్నాహక సమావేశానికి విజయవాడ వస్తుండగా.. ఆయన కారును గుంటూరు వద్ద టిప్పర్‌ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నానితో పాటు కారులో ఉన్న అందరూ సురక్షితంగా బయటపడ్డారు. పార్టీ శ్రేణులు అధైర్యపడొద్దని, తాను క్షేమంగా ఉన్నానని నాని ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని