TSPSC: పేపర్‌ లీకేజీ కేసు.. సిట్‌ అధికారుల కీలక నిర్ణయాలు

పేపర్‌ లీకేజీ కేసులో సిట్‌ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేసు విచారణలో భాగంగా కమిషన్‌ సభ్యులను విచారించాలని నిర్ణయించారు.

Published : 31 Mar 2023 17:54 IST


 

హైదరాబాద్‌: పేపర్‌ లీకేజీ కేసులో సిట్‌ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేసు విచారణలో భాగంగా కమిషన్‌లో పనిచేసే కొంతమంది సభ్యులను విచారించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌, సభ్యుడు లింగారెడ్డికి నోటీసులు జారీ చేశారు. అనితా రామచంద్రన్‌, లింగారెడ్డి దగ్గర నిందితులు ప్రవీణ్‌, రమేశ్‌లు పీఏలుగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దర్నీ సిట్‌ అధికారులు విచారించి వాంగ్మూలం నమోదు చేయాలని నిర్ణయించారు. ఈ కేసులో ఇప్పటికే ప్రవీణ్‌, రమేశ్‌ను సిట్‌ అధికారులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ కేసులో టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డిని కూడా సిట్‌ అధికారులు విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని