యాదాద్రి తరహాలో వేములవాడ ఆలయ అభివృద్ధి.. త్వరలో ప్రణాళిక: ఆర్కిటెక్ట్‌ ఆనందసాయి

యాదాద్రి తరహాలోనే వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని తీర్చిదిద్దేందుకు అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే వేములవాడ ఆలయాన్ని ఆర్కిటెక్ట్‌ ఆనందసాయి దర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజన్న ఆలయాన్ని గురించి తనతో పలుమార్లు చెప్పారని....

Updated : 04 Apr 2022 19:23 IST

వేములవాడ: యాదాద్రి తరహాలోనే వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని తీర్చిదిద్దేందుకు అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే వేములవాడ ఆలయాన్ని ఆర్కిటెక్ట్‌ ఆనందసాయి దర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజన్న ఆలయాన్ని గురించి తనతో పలుమార్లు చెప్పారని ఆనందసాయి తెలిపారు. సీఎంతో కలిసి వచ్చే ముందు ఒకసారి ఆలయాన్ని పరిశీలించాలని వచ్చినట్లు చెప్పారు. మరో 15 రోజుల్లో సీఎంతో చర్చించిన తర్వాత వేములవాడ ఆలయ అభివృద్ధిపై పూర్తి స్థాయి ప్రణాళిక సిద్ధం చేయనున్నట్లు ఆనందసాయి వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని