Robot Dog: రోబోట్‌ డాగ్‌ VS రియల్‌ డాగ్‌.. వీడియో వైరల్‌

Robot Dog: వీధి శునకం ముందుకు ఓ రోబో కుక్క వస్తే ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఊహించారా? అయితే ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

Published : 19 Mar 2024 20:49 IST

Robot Dog | ఇంటర్నెట్‌డెస్క్‌: జంతు ప్రేమికులు ఇంట్లో కుక్కల్ని పెంచుకోవడం సహజమే. అవి ఎంతో విశ్వాసంతో ఉంటాయి. అయితే వీటి స్థానంలో రోబో శునకాలు వచ్చేశాయి. ఇప్పటికే ఇతర దేశాల్లో అనేక సంస్థలు రోబో కుక్కల్ని ఆవిష్కరించాయి. ఇలాంటి రోబో శునకం, వీధి కుక్క కంట పడితే ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా? అలాంటి ఘటనకు సంబంధించిన వీడియోను ముక్స్ రోబోటిక్స్ వ్యవస్థాపకుడు, సీఈవో డాక్టర్ ముకేశ్‌ బంగర్ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. 

ముక్స్ రోబోటిక్స్ ఓ ప్రత్యేకమైన రోబో శునకాన్ని రూపొందించింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) కాన్పూర్‌లో నిర్వహించిన ‘‘Techkriti’’ సదస్సులో ఆ రోబో శునకాన్ని వీధి శునకం ముందు ఉంచింది. దీన్ని చూసి కుక్క హడలెత్తింది. దాని రూపం, నిర్మాణం చూసి ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత జరిగిన సంఘటన తెలియాలంటే ముకేశ్‌ బంగర్ పంచుకున్న వీడియో చూడాల్సిందే.

జొమాటో కొత్త సేవలు.. వెజిటేరియన్స్‌కు ఇక ప్రత్యేకంగా

ముకేశ్‌ బంగర్‌ పంచుకున్న ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తక్కువ సమయంలోనే పెద్ద సంఖ్యలో వీక్షణలను సొంతం చేసుకుంది. వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. నా పని నువ్వే చేస్తే ఇక నేనేం చేయాలని శునకం భావిస్తుండొచ్చంటూ ఓ యూజర్‌ రాసుకొచ్చాడు. ‘‘ఈ ఘటన చూసి నా స్నేహితులకు చెప్పినా వారు నమ్మరు, భవిష్యత్తులో కుక్కలను కూడా రోబోలు భర్తీ చేస్తాయి’’ అంటూ మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని