Zomato: జొమాటో కొత్త సేవలు.. వెజిటేరియన్స్‌కు ఇక ప్రత్యేకంగా

Zomato launches Pure Veg Mode: వెజిటేరియన్ల కోసం జొమాటో కొత్తతరహా సేవలకు శ్రీకారం చుట్టింది. శాకాహార పదార్థాలను ప్రత్యేకంగా డెలివరీ చేసేందుకు ప్యూర్‌ వెజ్‌ మోడ్‌ను తీసుకొచ్చింది.

Updated : 19 Mar 2024 19:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఫుడ్‌ డెలివరీ కంపెనీ జొమాటో (zomato) కొత్తతరహా సేవలకు శ్రీకారం చుట్టింది. శాకాహారుల కోసం ‘ప్యూర్‌ వెజ్‌ మోడ్‌’ను ( Pure Veg Mode) తీసుకొచ్చింది. ఈ ఆహారాన్ని డెలివరీ చేసేందుకు ప్రత్యేకంగా డెలివరీ ఏజెంట్లను ఏర్పాటుచేసింది. దేశంలో పెద్దసంఖ్యలో శాకాహారుల నుంచి వచ్చిన వినతుల మేరకు ఈ సేవలు ప్రారంభించినట్లు జొమాటో సీఈఓ దీపిందర్‌ గోయల్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఈతరహా సేవలు మరిన్ని తీసుకురానున్నట్లు చెప్పారు.

దేశంలో శాకాహారులు పెద్దసంఖ్యలో ఉన్నారని గోయల్‌ పేర్కొన్నారు. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో వారు ఆహారం తెప్పించుకునేటప్పుడు దాన్ని ఎలా వండుతున్నారు? దాన్ని ఎలా తీసుకొస్తారనే విషయంలో ఆందోళన చెందుతున్నారని, ఈవిషయంలో తమకు ఫీడ్‌బ్యాక్‌ అందిందని చెప్పారు. ఈ క్రమంలోనే గ్రీన్‌ మోడ్‌ సేవలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. తోటి ఉద్యోగితో కలిసి స్వయంగా డెలివరీ అందజేశారు.

₹169 రీఛార్జితో 90 రోజుల డిస్నీ సబ్‌స్క్రిప్షన్‌.. వొడా కొత్త ప్లాన్‌

ప్యూర్‌ వెజ్‌ మోడ్ ఎంచుకున్నప్పుడు ఆ లిస్ట్‌లో ఉన్న రెస్టరంట్ల నుంచే ఆహారం అందిస్తామని గోయల్‌ పేర్కొన్నారు. ఈ ఫుడ్‌ డెలివరీ చేసే ఏజెంట్లను సైతం ప్రత్యేకంగా నియమించినట్లు చెప్పారు. నాన్‌-వెజ్‌ రెస్టరంట్లు, ఆయా రెస్టరంట్లు అందించే శాకాహార పదార్థాలు కూడా ఈ జాబితాలో కనిపించబోవని తెలిపారు. ఈ పదార్థాలను సరఫరా చేసే ఏజెంట్లు సైతం ఇతర ఆహారాన్ని బ్యాగుల్లో పెట్టుకోరని పేర్కొన్నారు. ఈ సేవల ప్రారంభం వెనక మతపరమైన, రాజకీయపరమైన ఉద్దేశాలేవీ లేవని పేర్కొన్నారు. భవిష్యత్‌లో కేక్‌ డెలివరీ కోసం ప్రత్యేక ఫ్లీట్‌ను ఏర్పాటుచేయనున్నామని, డెలివరీ సమయంలో కేక్‌ ఏమాత్రం పాడవకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాటు ఉంటుందని చెప్పారు. ఈ సేవలు కూడా మరికొన్ని వారాల్లోనే ప్రారంభం కానున్నాయని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని