AP News: మార్చి నుంచే మాడు పగిలే ఎండలు.. ఏప్రిల్, మేలో మరింత అధికం

ఏపీలో మార్చి నుంచే తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే సూచనలు ఉన్నాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.

Updated : 04 Mar 2024 20:42 IST

అమరావతి: ఏపీలో మార్చి నుంచే తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే సూచనలు ఉన్నాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. ఏప్రిల్, మే నెలల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని పేర్కొంది. తీవ్రమైన వేడిగాలుల కారణంగా ప్రజలు వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

వడగాలుల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఫోన్లకు హెచ్చరిక సందేశాలు పంపాలని అధికారులు నిర్ణయించారు. ఎండలపై సమాచారం కోసం విపత్తు నిర్వహణ సంస్థలో 112, 1070, 18004250101 టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశారు. కర్నూలు, అనంతపురం, సత్యసాయి, కడప జిల్లాల్లో తీవ్రంగానూ.. అల్లూరి, కోనసీమ, విశాఖ, ప్రకాశం, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని సంబంధిత అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని