టీఎస్‌ జెన్‌కో, ట్రాన్స్‌కోలకు ధిక్కరణ నోటీసులు 

తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కోలకు సుప్రీంకోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.

Updated : 29 Jun 2021 14:44 IST

దిల్లీ: తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కోలకు సుప్రీంకోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. విద్యుత్‌ ఉద్యోగుల విభజన వ్యవహారంలో అత్యున్నత న్యాయస్థానం వీటిని వెలువరించింది. విధుల్లో చేరేందుకు తమకు అనుమతి ఇవ్వడం లేదని 84 మంది విద్యుత్‌ ఉద్యోగులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. గతంలో 1,150 మంది విద్యుత్‌ ఉద్యోగులను ఏపీ, తెలంగాణలకు 50 శాతం చొప్పున కేటాయించారు. ధర్మాధికారి నివేదిక ప్రకారం 655 మంది ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం విధుల్లోకి తీసుకుంది. 
ఈ క్రమంలో తెలంగాణ 84 మందిని మినహాయించి చేర్చుకుంది. దీంతో ఈ ఉద్యోగులు అత్యున్నత న్యాయస్థానంలో ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుకు, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డికి, కార్పొరేట్‌ కార్యాలయ అధికారి గోపాలరావుకు నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను జులై 16కి వాయిదా వేసింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని