Telangana News: గంజాయికి బానిసైన కోదాడ విద్యార్థికి ‘గాంధీ’లో చికిత్స .. వైద్యులు ఏమన్నారంటే?

గంజాయి మత్తుకు బానిసైన సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన 8వ తరగతి విద్యార్థి ప్రస్తుతం సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుమారుడు గంజాయి సేవిస్తున్నాడన్న ఆగ్రహంతో తల్లి ...

Published : 07 Apr 2022 01:44 IST

హైదరాబాద్: గంజాయి మత్తుకు బానిసైన సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన 8వ తరగతి విద్యార్థి ప్రస్తుతం సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుమారుడు గంజాయి సేవిస్తున్నాడన్న ఆగ్రహంతో తల్లి .. బాలుడిని స్తంభానికి కట్టేసి కళ్లలో కారం పోసి కొట్టడంతో గాయపడ్డాడు. గంజాయి అధిక మోతాదులో తీసుకోవడంతో బాలుడికి మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు తలెత్తినట్టు గాంధీ ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు. ఏడాది నుంచి తోటి స్నేహితులతో కలిసి నిర్మానుష్య ప్రాంతాల్లో గంజాయి సేవిస్తూ, ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే మత్తులో తూగుతూ ఉండే వాళ్లమని విద్యార్థి తెలిపాడు. ఒక సారి ఫ్రెండ్‌ ద్వారా గంజాయి సేవించడంతో దానికి బానిసయ్యానని వివరించాడు. అరకు నుంచి  గంజాయి వస్తుందని, ఒక్కో పొట్లం రూ.500 చొప్పున కొనుగోలు చేస్తున్నామని తెలిపాడు. తాము కూలి పనులకు ఉదయం వెళ్లి రాత్రికి ఇంటికి వస్తామని, కుమారుడు గంజాయి సేవిస్తున్న విషయం ఆలస్యంగా గుర్తించామని విద్యార్థి తండ్రి మీడియాకు వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని