AP News: పీఆర్సీ నివేదిక బయటపెట్టేందుకు ఎందుకు జంకుతున్నారు?: బొప్పరాజు

 ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వేతన సవరణ సంఘం (పీఆర్సీ) తదితర సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ ఐకాస, ఏపీ 

Updated : 07 Dec 2021 17:46 IST

అమరావతి: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వేతన సవరణ సంఘం (పీఆర్సీ) తదితర సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి తలపెట్టిన తొలిదశ ఉద్యమం ప్రారంభమైంది. కర్నూలు, ఏలూరు, పాడేరు తదితర ప్రాంతాల్లో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. భోజన విరామ సమయంలోనూ నిరసనలు తెలపనున్నారు. నిరసనల్లో భాగంగా ర్యాలీలు, ధర్నాలు నిర్వహించనున్నారు. కర్నూలులో ఉద్యోగుల నిరసన కార్యక్రమంలో ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వం మమ్మల్ని విస్మరించిందనే భావన ఉద్యోగుల్లో ఉంది

పీఆర్సీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సినంత సమయం ఇచ్చి తమ ఉద్యమ కార్యాచరణ ప్రకటించామని బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాదని తెలుసుకుని ఉద్యమానికి పిలుపునిచ్చామన్నారు. తమను రెచ్చగొట్టేలా ప్రవర్తించినా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టలేదని బొప్పరాజు చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలగజేయొద్దనే సంయమనంతో ఉన్నామని.. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ‘‘ప్రభుత్వం మొక్కుబడిగా ఒకట్రెండు సమావేశాలు నిర్వహించింది. దీనివల్ల ఉద్యోగులకు ఒరిగిందేమీ లేదు. పీఆర్సీ ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించినా పట్టించుకోలేదు. కనీసం దానికి సంబంధించిన నివేదిక బయటపెట్టలేదు. దానికి కూడా ఎందుకు జంకుతున్నారు. నివేదిక బహిర్గతం చేయనివాళ్లు పీఆర్సీ ప్రకటిస్తారని ఎలా అనుకుంటాం? ప్రభుత్వం తమను పూర్తిగా విస్మరించిందనే భావన ఉద్యోగుల్లో ఉంది’’ అని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని