AP Floods: ఏపీలో వరదల నష్టం అంచనా.. తిరుపతిలో కేంద్ర బృందం పర్యటన

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా ఏర్పడిన నష్టాన్ని అంచనా వేసేందుకు చిత్తూరు జిల్లాలో కేంద్ర బృందం విస్తృతంగా

Updated : 27 Nov 2021 17:16 IST

చిత్తూరు: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా ఏర్పడిన నష్టాన్ని అంచనా వేసేందుకు చిత్తూరు జిల్లాలో కేంద్ర బృందం విస్తృతంగా పర్యటిస్తోంది. పర్యటనలో భాగంగా వరద ప్రభావిత ప్రాంతాలైన తిరుపతిలోని ఏపీఎస్పీడీసీఎల్ రోడ్డు, ఎమ్మార్ పల్లి, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం రోడ్డు, గొల్లవాని గుంట, కృష్ణా రెడ్డి నగర్, పూలవాణిగుంట, కొరమేను గుంట తదితర ప్రాంతాలను బృందలోని అధికారులు సందర్శించారు. ఆయా ప్రాంతాల్లోని రహదారులు, ముంపునకు గురైన ఇళ్లను పరిశీలించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, జిల్లా పాలనాధికారి హరి నారాయణ, నగరపాలక కమిషనర్‌ గిరీష నష్ట వివరాలను ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసి కేంద్ర బృందానికి వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని