Ap News: ప్రభుత్వ అధీనంలోకి ఎయిడెడ్‌ విద్యాసంస్థలు.. ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడెడ్‌ విద్యాసంస్థలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటూ జారీ చేసిన జీవోను సవాల్‌ చేస్తూ విద్యాసంస్థల అసోసియేషన్లు దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపింది. విచారణలో భాగంగా ప్రభుత్వంపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది....

Updated : 24 Sep 2021 15:31 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడెడ్‌ విద్యాసంస్థలను ప్రభుత్వ అధీనంలోకి తీసుకుంటూ జారీ చేసిన జీవోను సవాల్‌ చేస్తూ విద్యాసంస్థల అసోసియేషన్లు దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపింది. విచారణలో భాగంగా ప్రభుత్వంపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిడెడ్‌ విద్యాసంస్థల అంగీకారాన్ని బలవంతంగా తీసుకుంటున్నారని పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది ఎన్‌.సుబ్బారావు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అధికారులకు కడప డీఈవో జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను పిటిషనర్‌ ధర్మాసనం ముందు ప్రవేశపెట్టారు. విచారణలో భాగంగా పిటిషనర్‌ ప్రొసీడింగ్స్‌ను ప్రధాన న్యాయమూర్తి చదివి వినిపించారు. ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఎయిడెడ్‌ విద్యాసంస్థలపై ఒత్తిడి తీసుకొస్తున్నారనే విషయం కనపడుతోందని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రభుత్వంలోకి తీసుకొనేందుకు అంగీకరించిన విద్యాసంస్థల నుంచి మాత్రమే అంగీకారపు పత్రాలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మరో విధంగా జరగుతున్నట్లు తెలుస్తోందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దీనిపై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. ఈ నెల 29న డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ధర్మాసనం ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణ 29వ తేదీకి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని