
Ganesh Immersion: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహాగణపతి
హైదరాబాద్: పంచముఖ రుద్ర మహా గణపతి రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం పూర్తయింది. ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన నాలుగో నంబర్ క్రేన్ ద్వారా మహా గణపతిని గంగమ్మ ఒడికి చేర్చారు. చివరి రోజు మహాగణపతి దర్శనం కోసం భారీగా భక్తులు తరలివచ్చారు. ఇవాళ ఉదయం 8.18 గంటలకు ప్రారంభమైన గణనాథుని శోభాయాత్ర.. భక్తుల కోలాహలం మధ్య సందడిగా కొనసాగింది. 9 రోజులుగా మహాగణపతి దర్శనం కోసం హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. ట్యాంక్‌బండ్‌పై తుదిపూజల అనంతరం మహాగణపతి నిమజ్జన ప్రక్రియ పూర్తిచేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.