
AP News: సినీనటుడు మోహన్‌బాబు తమ్ముడు రంగస్వామి నాయుడు కన్నుమూత
తిరుపతి: ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబు తమ్ముడు మంచు రంగస్వామి నాయుడు(63) బుధవారం కన్నుమూశారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో ఆయనకు గుండెపోటు రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. గురువారం ఉదయం తిరుపతి గోవింద ధామం వద్ద అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మోహన్‌బాబు కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. రంగస్వామి నాయుడు మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.