TS News: తీసుకెళ్లిన పుస్తకాలు తిరిగివ్వాలి: ఆర్కే భార్య శిరీష

పుస్తకాలను పోలీసులు తిరిగివ్వాలని మావోయిస్టు ఆర్కే భార్య శిరీష డిమాండ్‌ చేశారు.

Updated : 14 Nov 2021 15:00 IST

హైదరాబాద్‌: ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత సంస్మరణ సభ జరుపుకుంటారని.. తాను అదే విధంగా చేయాలని ప్రయత్నిస్తే అడ్డుకున్నారని ఇటీవల మరణించిన మావోయిస్టు ఆర్కే భార్య శిరీష అన్నారు. నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. 2004లో ఆర్కే ప్రభుత్వంతో చర్చలకు వచ్చినప్పుడు మీడియాలో వచ్చిన కథనాలు, ఫోటోలు, అరెస్టు అయినప్పుడు వచ్చిన కథనాలను పుస్తకంగా తీసుకురావాలనుకున్నట్లు శిరీష చెప్పారు. ఆర్కే జ్ఞాపకాల పుస్తక ముద్రణను పోలీసులు అడ్డుకున్నారన్నారు. రెండు రోజుల క్రితం ప్రింటింగ్ ప్రెస్‌పై పోలీసులు దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ముద్రణ దశలోనే పుస్తకాలను తీసుకెళ్లిపోయారని ఆమె తెలిపారు. పుస్తకాలను పోలీసులు తిరిగివ్వాలని శిరీష డిమాండ్‌ చేశారు. పుస్తకావిష్కరణకు అవకాశం కల్పించాలని కోరారు. సామాజిక వేత్త, హక్కుల సంఘం నాయకుడు ఆచార్య హరగోపాల్ కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని