AP News: వైభవంగా పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం

ఉత్తరాంధ్ర కల్పవల్లి, విజయనగరం ప్రజల ఆరాధ్యదైవం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఘనంగా జరిగింది. సంప్రదాయబద్దంగా పాలధార, తెల్ల ఏనుగు, అంజలిరథం ముందు నడవగా.. భక్తుల జయజయ ధ్వానాల మధ్య పైడితల్లి అమ్మవారు ఉత్సవ వీధుల్లో సిరిమాను రూపంలో ముమ్మారు ఊరేగి ప్రజలను ఆశీర్వదించారు..

Published : 20 Oct 2021 01:02 IST

విజయనగరం: ఉత్తరాంధ్ర కల్పవల్లి, విజయనగరం ప్రజల ఆరాధ్యదైవం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఘనంగా జరిగింది. సంప్రదాయబద్దంగా పాలధార, తెల్ల ఏనుగు, అంజలిరథం ముందు నడవగా.. భక్తుల జయజయ ధ్వానాల మధ్య పైడితల్లి అమ్మవారు ఉత్సవ వీధుల్లో సిరిమాను రూపంలో ముమ్మారు ఊరేగి ప్రజలను ఆశీర్వదించారు. అమ్మవారి ప్రతిరూపంగా సిరిమానుపై పైడితల్లి ఆలయ ప్రధాన పూజారి బంటుపల్లి వెంకటరావు ఆశీనులై భక్తులకు దర్శనమిచ్చారు. సిరిమాను రూపంలో పైడితల్లి అమ్మవారు.. తన పుట్టినిల్లు విజయనగరం కోట వరకు 3 సార్లు ఊరేగి.. రాజకుటుంబానికి దీవెనలు అందించారు.

కరోనా నేపథ్యంలో ఈ ఏడాది పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని సంప్రదాయాల ప్రకారం నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు అవంతి శ్రీనివాసరావు, బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి తదితరులు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రాంగణం నుంచి సిరిమానోత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకించారు. 
మాన్సాస్‌ట్రస్ట్‌ ఛైర్మన్‌, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు, ఆయన కుటుంబ సభ్యులు, తెదేపా నేతలు గుమ్మడి సంధ్యారాణి, ద్వారపురెడ్డి జగదీశ్‌, కేఏ నాయుడు తదితరులు కోట బురుజుపై నుంచి సిరిమాను ఉత్సవాన్ని వీక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు