
Updated : 23 Dec 2021 08:18 IST
TSRTC: మేడారం మహాజాతర.. 3,845 బస్సులు నడిపేందుకు నిర్ణయం
ఈనాడు, వరంగల్: వచ్చే ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరిగే మేడారం మహాజాతర కోసం తెలంగాణ ఆర్టీసీ 3845 బస్సులు నడిపేందుకు నిర్ణయించింది. సుమారు 21 లక్షల మంది భక్తులు వస్తారనే అంచనాతో 2020లోనూ దాదాపు ఇదే సంఖ్యలో ఆర్టీసీ సర్వీసులు నడిపింది. భక్తులు భారీగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి రానున్న నేపథ్యంలో ఒక్క వరంగల్ ఆర్టీసీ రీజియన్ నుంచే 2,250 బస్సులను నడిపేందుకు ఆమోదం లభించింది. ఈసారీ హైదరాబాద్ నుంచి ఏసీ బస్సులు నడవనున్నాయి. జాతర సమయంలో బస్సులను నిలిపేందుకు ఆర్టీసీ 50 ఎకరాల్లో భారీ బస్టాండును నిర్మిస్తోంది. స్థలాన్ని చదును చేసి టికెట్లకు క్యూ లైన్ల ఏర్పాటు పనులు బుధవారమే ప్రారంభమయ్యాయి.
Tags :