Ts Eamcet Hall Tickets: వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు.. 29 వరకు దరఖాస్తుకు అవకాశం

తెలంగాణ ఎంసెట్ హాల్ టికెట్ల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు డౌన్‌లోడ్‌ చేసుకొనేందుకు హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఎంసెట్..

Published : 23 Jul 2021 21:28 IST

హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్ హాల్ టికెట్ల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు డౌన్‌లోడ్‌ చేసుకొనేందుకు హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొ. గోవర్దన్ తెలిపారు. నేటి నుంచి ఈనెల 31 వరకు విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు. బిట్‌శాట్, ఎంసెట్ ఒకే రోజు ఉన్న విద్యార్థులు.. సమాచారం ఇస్తే మరో రోజుకు మారుస్తామన్నారు. ఇవాళ్టి వరకు ఇంజినీరింగ్‌ కోర్సులకు 1.63 లక్షలు, వ్యవసాయ, ఫార్మా కోర్సులకు 85,828 మంది విద్యార్థులతో కలిపి మొత్తంగా 2.49 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. ఎంసెట్‌కు రూ.500 ఆలస్య రుసుముతో ఈనెల 29 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఆగస్టు 4 నుంచి 10 వరకు ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని