Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం.. వాతావరణ శాఖ హెచ్చరిక

నగరంలో రానున్న గంటపాటు మొస్తరు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నగరవాసులు ఇళ్లలోనే ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది...

Updated : 08 Dec 2022 16:50 IST

హైదరాబాద్: నగరంలో రానున్న గంటపాటు మొస్తరు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నగరవాసులు ఇళ్లలోనే ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని నగరవాసులకు సూచించింది.

సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ముషీరాబాద్, భోలక్‌పూర్, ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌, చిక్కడపల్లి, రాంనగర్‌, కవాడీగూడ, ఇందిరా పార్క్‌, దోమలగూడ, విద్యానగర్, అడిక్‌మెట్‌ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. బోయిన్‌పల్లి, చిలకలగూడా, మారెడ్‌పల్లి, బేగంపేట, ప్యాట్నీ సెంటర్‌, ప్యారడైస్, అల్వాల్‌లో వర్షం మొదలైంది. నగరంలో భారీ వర్షం కురుస్తుండటంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో మోకాలిలోతు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని