TS News: తెలంగాణలో రాగల 3రోజుల పాటు మోస్తరు వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈరోజు, ఎల్లుండి

Updated : 24 Sep 2022 15:43 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈరోజు, ఎల్లుండి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం సంచాలకులు పేర్కొన్నారు. ఎల్లుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయన్నారు. నిన్న అగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న ఉత్తర అండమాన్‌ సముద్ర ప్రాంతాల్లో అల్పపీడనం ఈరోజు ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని సంచాలకులు వివరించారు. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి సుమారు 5.8 కి.మీ ఎత్తులో కొనసాగుతోందన్నారు. ఈ అల్పపీడనం ఇంచుమించు పశ్చిమదిశగా కదులుతూ దక్షిణ ఆంధ్రప్రదేశ్‌-ఉత్తర తమిళనాడు తీరం వద్ద దానిని అనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతం ప్రాంతాలకు ఈనెల 18న చేరే అవకాశం ఉందని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని