icon icon icon
icon icon icon

Banagalapalle: బనగానపల్లిలో తెదేపా, వైకాపా వర్గాల మధ్య ఘర్షణ.. రాళ్లదాడిలో ఆరుగురికి గాయాలు

తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణతో నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Updated : 07 May 2024 12:52 IST

బనగానపల్లి: తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణతో నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పట్టణంలోని సంతమార్కెట్‌లో వైకాపా, తెదేపా ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. తొలుత వైకాపా ప్రచారం ముగియగా.. ఆ తర్వాత తెదేపా అభ్యర్థి బీసీ జనార్దన్‌రెడ్డి సతీమణి ఇందిరమ్మ తమ పార్టీ నేతలతో అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో తెదేపా నాయకులు దాడి చేశారని కొంతమంది వైకాపా కార్యకర్తలు చెప్పడంతో ఆ పార్టీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి కుమారుడు ఓబుల్‌రెడ్డి వాహనాలతో మార్కెట్‌కు వెళ్లారు. అక్కడ ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనతో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img