Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 08 Dec 2022 08:59 IST

1. దొంగల ముఠా గుట్టు విప్పిన తెల్లచొక్కా

సంచలనం సృష్టించిన నాగోల్‌ కాల్పుల కేసులో దోపిడీ దొంగల గుట్టు ఒక్క తెల్లచొక్కాతో రట్టయింది. రూ.1.36 కోట్ల విలువైన బంగారం కొట్టేసిన వ్యవహారంలో ఆరుగుర్ని అరెస్టు చేయగా ప్రధాన సూత్రధారి సహా నలుగురు పరారీలో ఉన్నారు. 2.7 కిలోల బంగారం, రూ.65,500, మూడు దేశవాళీ పిస్టళ్లు, 25 రౌండ్ల బుల్లెట్లు, ఒక ఎయిర్‌పిస్టల్‌ స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ బుధవారం ఎల్బీనగర్‌లో విలేకరులకు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. నేటి నుంచి కంచాల్లో అన్నప్రసాదం

కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో నిత్యాన్నదాన పథకంలో భక్తులకు ఇకపై అరిటాకులకు బదులు కంచాల్లోనే అన్న ప్రసాదం అందించనున్నారు. గురువారం మధ్యాహ్నం నుంచి ఈ విధానం ఆచరణలోకి రానుంది. సత్యనారాయణ స్వామి క్షేత్రంలో నిత్యాన్నదాన పథకాన్ని 35 ఏళ్ల క్రితం 200 మందితో ప్రారంభించారు. భక్తుల విరాళాలు రూ. 54 కోట్లు బ్యాంకులో డిపాజిట్‌ చేసి... వడ్డీతో నిత్యం మధ్యాహ్నం పూట అన్నప్రసాదం అందిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. సారూ.. పురుగులన్నం పెడుతున్నారు

సారూ మధ్యాహ్న భోజనంలో పురుగు వచ్చింది. అది చూసి అన్నం పడేశానని పాఠశాలకు రావద్దంటూ టీచర్‌ బెదిరించారు.. అంటూ నాలుగో తరగతి విద్యార్థిని బుధవారం మీర్‌పేట పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్‌పేట ప్రశాంతిహిల్స్‌లో నివాసం ఉంటున్న శ్రీను కుమార్తె పూజిత స్థానిక ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. మంగళవారం మధ్యాహ్న భోజన సమయంలో... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Video: భారత్‌లో ఉష్ణోగ్రతల పెరుగుదలపై ప్రపంచ బ్యాంక్‌ నివేదిక

4. చేపా చేపా ఎంత తెస్తావ్‌!

ఫిష్‌ఆంధ్రా పేరిట చేపల విందు చేసేందుకు సర్కారు   కసరత్తు చేస్తోంది. దీని కోసం బీఎఫ్‌ఎఫ్‌ అనే సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ఒక్కో జిల్లాకు 20 నుంచి 30 ఆహారశాలలు(రెస్టారెంట్లు) ఏర్పాటు చేయాలని మత్స్యశాఖకు ఉత్తర్వులు ఇచ్చింది. రాయితీపై బ్యాంకుల నుంచి రుణాలిప్పించి కొత్త ఏడాది నాటికి చేపల రుచులు పంచాలని అధికారులు చర్యలు ప్రారంభించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఇక్కడ తరచూ భూకంపమే..!

ఈ చిత్రం చూడగానే రష్యా ఉక్రెయిన్‌ యుద్ధం తాలుకు బాంబు పేలుళ్లు అనుకుంటే పొరపాటే.. ఇది హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం మునిపల్లిలో ఇటీవల క్వారీని పేల్చిన దృశ్యం. ఇక్కడి క్వారీల్లో బోరు బ్లాస్టింగ్‌ చేస్తుండడంతో మునిపల్లితోపాటు స్థానిక గ్రామాల ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. పేలుళ్ల ధాటికి ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయి.  ఇలాంటి మూడు క్వారీల్లో నిబంధనలకు విరుద్ధంగా పేలుళ్లు చేపడుతుండడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కొండను మింగిన అనకొండ!

పచ్చటి కొండపై అధికార పార్టీకి చెందిన ఓ నేత కన్ను పడింది. ప్రజాసేవ పేరిట జనాలను నమ్మించేందుకు ఎత్తుగడ వేశారు. ప్రభుత్వ భవనాలను ఊరికి దూరంగా తరలించుకునిపోయి కొండ ప్రాంతంలో నిర్మించే ప్రయత్నం చేశారు. చదును పేరిట తనకు కావాల్సిన ప్రభుత్వ భూమిని కాజేశారు. తన ఇంటికి రహదారి నిర్మించుకునే క్రమంలో చెరువును కొంత పూడ్చేశారు... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Video: ఇంధన కొనుగోళ్ల విషయంలో.. ఐరోపా తీరుపై భారత్‌ ఆగ్రహం

7. ఈ పాపం ఇంకెన్నాళ్లు..!

తీవ్ర పేదరికం.. చిన్నతనంలోనే తల్లి మరణం.. అనాథాశ్రమంలో ఆశ్రయం.. ఇలా జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా మనోధైర్యంతో ముందడుగు వేశాడు పామిడి మండలంలోని పాళ్యం తండాకు చెందిన చిన్ని కృష్ణనాయక్‌. పర్వతారోహణ, వాలీబాల్‌, కుస్తీ, బాడీ బిల్డింగ్‌, కరాటే వంటి వాటిల్లో నైపుణ్యం సాధించి అవార్డులు, ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం సేవాగఢ్‌ గిరిజన సంక్షేమ పాఠశాలలో వ్యాయమ ఉపాధ్యాయుడిగా తాత్కాలిక ఉద్యోగిగా చేస్తున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. బృహత్తర ప్రణాళికపైనే ఆశలు

భక్తుల కొంగుబంగారం..కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు అంజన్న ఆలయంపై ఎట్టకేలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వరాలజల్లు కురిపించడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో జిల్లావాసులు, భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొండగట్టులో భక్తులకు సరైన వసతులులేక అసౌకర్యానికి గురవుతున్నారని.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

AAP: దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనం

10. మహా అవస్థలు

విజయవాడలో బుధవారం వైకాపా నిర్వహించిన జయహో బీసీ సభకు ఆర్టీసీ బస్సుల్ని కేటాయించడంతో ఆయా మార్గాల్లో బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి జిల్లాలో 107 బస్సులు సభకు జనం తరలించడానికి పంపారు. దీంతో మంగళవారం అర్ధరాత్రి వెళ్లిన బస్సులు బుధవారం రాత్రికి ఆయా డిపోలకు వచ్చాయి. దీంతో బుధవారం కొన్ని మార్గాల్లో సర్వీసులు తగ్గించడం, బస్సుల మధ్య సమయాన్ని పెంచడం ద్వారా ఆర్టీసీ అధికారులు సర్దుబాటు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని