Top Ten News @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 13 Jul 2021 13:22 IST

1. WHO: అది ప్రమాదకరం..!

వేర్వురు తయారీదార్లు చేసిన వ్యాక్సిన్లను కాంబినేషన్‌ రూపంలో తీసుకోవడం ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ హెచ్చరించారు. ఇదో ప్రమాదకరమైన విధానమని ఆమె పేర్కొన్నారు. ఇప్పటి వరకూ కొవిడ్‌ వ్యాక్సిన్ల కాంబినేషన్‌పై సరైన డేటా అందుబాటులో లేకపోవడంతో ఇది చాలా రిస్క్‌తో కూడుకొన్న విషయమని తెలిపారు. ప్రజలే సొంతంగా ఎక్కడ, ఎప్పుడు, ఏ వ్యాక్సిన్‌ తీసుకోవాలో నిర్ణయించుకోవడం ఆందోళనకర విధానమన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Third Wave: మూడో వేవ్‌కు ఇదే సంకేతమా?

2. Modi: కేంద్ర కేబినెట్‌ కమిటీల్లో మార్పులు

కేంద్ర మంత్రివర్గ విస్తరణ పూర్తయిన నేపథ్యంలో కేబినెట్‌ కమిటీలను ప్రధాని నరేంద్ర మోదీ పునర్‌వ్యవస్థీకరించారు. కొత్త, పాత మంత్రులతో మార్పులు చేశారు. ప్రధాని మోదీ నేతృత్వం వహిస్తున్న అత్యంత ప్రాధాన్యం ఉండే రాజకీయ వ్యవహారాల కేబినెట్ ఉపసంఘంలో స్మృతి ఇరానీ, భూపేంద్ర యాదవ్‌, వీరేంద్రకుమార్‌, గిరిరాజ్‌సింగ్‌, అర్జున్‌ ముండా, శర్వానంద సోనోవాల్‌, మన్‌సుఖ్‌ మాండవీయకు చోటు దక్కింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. పయ్యావుల ఆరోపణలు హాస్యాస్పదం: బుగ్గన

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అనవసర విమర్శలు చేస్తున్నారని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అన్నారు. తెదేపా సీనియర్‌ నేత, ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయని చెప్పారు. ఆడిట్ సంస్థ ప్రశ్నల ఆధారంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారన్నారు. వైకాపా ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అకౌంటింగ్ వ్యవహారాల్లో తప్పిదాలు జరిగాయని పయ్యావుల ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో బుగ్గన విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. గాంధీనగర్‌ పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

నగరంలోని బాలానగర్‌ పోలీస్‌ స్టేషన్ పరిధి గాంధీనగర్‌ పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం సంభవించింది. పారిశ్రామిక వాడలోని రంగారెడ్డి నగర్‌లో ఉన్న ప్రేరణి ఇండస్ట్రీస్‌ ప్లైవుడ్‌ గోదాములో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. గోదాములో కర్రలు ఉండటంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Arya: ‘సార్‌పట్ట’ ట్రైలర్‌ వచ్చేసింది

‘కబాలి’, ‘కాలా’ చిత్రాలతో తెలుగులోనూ విశేష ఆదరణ పొందారు తమిళ దర్శకుడు పా. రంజిత్‌. ఇప్పుడు ఆయన నుంచి ‘సార్‌పట్ట’ అనే చిత్రం రాబోతుంది. ఆర్య కథానాయకుడిగా బాక్సింగ్‌ నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించారాయన. జులై 22 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలోనే ట్రైలర్‌ విడుదలైంది. ఇప్పటికే విడుదలైన ఆర్య లుక్స్‌, గ్లింప్స్‌ సినిమాపై అంచనాలు పెంచాయి. ఆ అంచనాలు అందుకునేలా ట్రైలర్‌ని తీర్చిదిద్దారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

సెకన్ల‘పాటే’ కనిపించారు.. ఉర్రూతలూగించారు 

6. Corona: 31వేలకు దిగొచ్చిన కేసులు

శంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా కొత్త కేసులు తగ్గినప్పటికీ.. మరణాలు మాత్రం భారీగా పెరిగాయి. నిన్న 17,40,325 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 31,443 మందికి పాజిటివ్‌గా తేలింది. 118 రోజుల కనిష్ఠానికి కొత్త కేసులు క్షీణించాయి. అయితే గత 24 గంటల వ్యవధిలో 2020 మంది ప్రాణాలు కోల్పోయారు. గత కొన్ని రోజులుగా 1,000లోపు నమోదవుతోన్న మరణాల సంఖ్యలో.. భారీ పెరుగుదల చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Google: గూగుల్‌కు భారీ జరిమానా

టెక్‌ దిగ్గజం గూగుల్‌కు ఫ్రాన్స్‌ ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. కాపీరైట్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకు 500 మిలియన్‌ యూరోల ఫైన్‌ వేసింది. భారత కరెన్సీలో ఈ జరిమానా విలువ రూ.4,415 కోట్లు. జరిమానాపై గూగుల్‌ ప్రతినిధులు స్పందించాల్సి ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Pichai: ఇంటర్నెట్‌పై పలు దేశాల్లో దాడి 

8. Dubai: నీటిలో నగరం.. నిండా ఆనందం

ప్రపంచంలో అత్యంత ఎత్తయిన భవనం ‘బుర్జ్‌ ఖలీఫా’ (2,722 అడుగులు)ను నిర్మించి రికార్డు సృష్టించిన దుబాయ్‌ ఇప్పుడు మరో ఘనతను సాధించింది. ప్రపంచంలోనే అత్యంత లోతైన ఈత కొలనును నిర్మించింది. డైవింగ్‌కు ఉపయోగపడేలా దీన్ని తీర్చిదిద్దింది. పోలండ్‌లో 50 అడుగుల లోతు ఉన్న ‘డీప్‌ స్పాట్‌’ పేరున ప్రపంచ రికార్డు ఉండగా, దాన్ని ఎన్నో రెట్లు అధిగమించి ‘డీప్‌ డైవ్‌’ పేరుతో ఏకంగా 197 అడుగుల (60మీటర్లు) లోతులో దీన్ని నిర్మించడం విశేషం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. 1983 ప్రపంచకప్‌ హీరో యశ్‌పాల్‌ కన్నుమూత

టీమ్‌ఇండియా 1983 ప్రపంచకప్‌ హీరోల్లో ఒకరైన యశ్‌పాల్‌ శర్మ(66) మంగళవారం మరణించారు. తీవ్ర స్థాయిలో గుండెపోటు రావడంతో ఆయన కన్ను మూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. ‘అవును, యశ్‌పాల్‌ ఇక లేరు. ఆయన కుటుంబ సభ్యుల నుంచి ఇప్పుడే సమాచారం అందింది’ అని యశ్‌పాల్‌తో కలిసి ఆడిన సహచరుడు పీటీఐకి తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Chris Gayle: టీ20ల్లో 14,000 పరుగులు

10. ఇంటికి చేసిన ఏ ఖ‌ర్చుల‌పై ప‌న్ను త‌గ్గింపు ల‌భిస్తుంది?

మీరు ఇంటిని అమ్మే విక్రయిస్తుంటే, మూలధన లాభాలను లెక్కించడానికి, ఇంటిని పున‌రుద్ధ‌రించిన‌ ఖర్చులను జోడించవచ్చు. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం కొనుగోలు ధరతో పాటు ఆదునీక‌రించిన‌ ఖర్చుపై మీరు ఇండెక్సేష‌న్‌ ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. ఇది మూలధన లాభాలను తగ్గించడానికి సహాయపడుతుంది. తగ్గింపును క్లెయిమ్ చేయడానికి గృహ ఆదునీక‌ర‌ణ‌ ఖర్చులు ఏమిటో మొదట అర్థం చేసుకోవాలి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని