Updated : 23 Aug 2021 13:16 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. Corona: అక్టోబర్‌లో గరిష్ఠానికి మూడో ముప్పు..!

కరోనా థర్డ్‌వేవ్‌ అక్టోబర్ నాటికి గరిష్ఠస్థాయికి చేరుకోవచ్చు.. పెద్దల వలే పిల్లలు ప్రభావితం కావొచ్చు.. ఇవి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ సూచనలు. నిపుణుల బృందం ఈ నివేదికను ప్రధానమంత్రి కార్యాలయానికి సమర్పించినట్లు ఓ వార్త సంస్థ కథనం పేర్కొంది. ‘థర్డ్‌వేవ్‌ ప్రిపేర్డ్‌నెస్: చిల్డ్రన్ వల్నరబిలిటీ అండ్ రికవరీ’ శీర్షికన వెలువడిన ఈ నివేదిక అందుబాటులో ఉన్న సదుపాయాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* India Corona: 5 నెలల కనిష్ఠానికి ఉద్ధృతి.. భారీగా తగ్గిన కొత్త కేసులు

2. GHMC : అందరికీ టీకాలే లక్ష్యంగా.. ప్రారంభమైన స్పెషన్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌

గ్రేటర్ హైదరాబాద్‌లో అందరికీ టీకాలే లక్ష్యంగా స్పెషల్‌ కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ప్రారంభమైంది. వైద్య ఆరోగ్య శాఖ, జీహెచ్‌ఎంసీ, కంటోన్మెంట్‌ బోర్డులు ఉమ్మడిగా ఈ ప్రక్రియను చేపట్టాయి. విస్తృతంగా జరగనున్న ఈ ప్రక్రియ ద్వారా అర్హులైన అందరికీ వ్యాక్సిన్‌ అందజేయనున్నారు. ఇందుకోసం సంచార వ్యాక్సిన్‌ వాహనాలను ఏర్పాటు చేశారు. మొబైల్ వాహనాలతో వీధుల్లో తిరుగుతూ జీహెచ్‌ఎంసీ ప్రచారం నిర్వహిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. TS News: దేశం బంగ్లాదేశ్‌తో పోటీ పడలేకపోతుంది: హరీశ్‌రావు

గత ఆరేళ్లలో తెలంగాణ రాష్ట్రం 11.5 శాతం ఆర్థిక వృద్ధి రేటును నమోదు చేసిందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. గడిచిన ఏడేళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ‘‘ఆరేళ్లలో దేశం 7 శాతం వృద్ధి రేటు సాధించింది. దేశం కంటే తెలంగాణ 3 శాతానికి పైగా వృద్ధి రేటు సాధించాం. కేసీఆర్‌ విధానాల వల్లే వృద్ధి రేటు సాధ్యమైంది’’ అని హరీశ్‌రావు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* హుజూరాబాద్‌లో దళితబంధుకు మరో రూ.500 కోట్లు విడుదల

4. Tollywood: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో వచ్చే సినిమాలివే!

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో బాక్సాఫీస్‌ వద్ద సినిమాల సందడి కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిబంధనల మేరకు సినిమాలు ప్రదర్శిస్తున్నారు. దీంతో ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న చిన్న సినిమాలు థియేటర్‌ల వైపు క్యూ కడుతున్నాయి. మరోవైపు ఇప్పటికే చేసుకున్న ఒప్పందం మేరకు సినిమాలను ఓటీటీ వేదికగా తీసుకొస్తున్నారు. మరి ఆగస్టు చివరి వారంలో థియేటర్‌/ఓటీటీలో సందడి చేయబోయే సినిమాలేంటో చూసేద్దామా! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Afghanistan: నేనెవరినీ నమ్మను.. తాలిబన్ల హామీలపై బైడెన్‌ స్పందన!

తాలిబన్లు తమ పాలనను గుర్తించాలని కోరుతున్నారని.. ఈ మేరకు కొన్ని హామీలు కూడా ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. అయితే, వారు మాటపై నిలబడతారో.. లేదో.. చూడాల్సి ఉందన్నారు. తానెవరినీ నమ్మనని తెలిపారు. తాలిబన్లపై నమ్మకం ఉందా?అని ఆదివారం శ్వేతసౌధంలో పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Afghanistan: ముష్కరులకు చిక్కకుండా.. విమాన విన్యాసాలు 

6. Caste Census: కులగణనను భాజపా ఎప్పుడూ వ్యతిరేకించలేదు: సుశీల్‌ మోదీ

జనగణనను కులాలవారీగా చేపట్టాలనే డిమాండును తామెప్పుడూ వ్యతిరేకించలేదని భాజపా సీనియర్‌ నేత సుశీల్‌ కుమార్‌ మోదీ అన్నారు. కులగణనపై సోమవారం ప్రధాని మోదీతో చర్చిండానికి వెళుతున్న బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌‌, ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్‌తో కూడిన బృందంలో భాజపా ప్రతినిధి కూడా ఉంటారని ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఆయన వరుస ట్వీట్లు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Shaili Singh: ఒలింపిక్స్‌లో మరో సంచలనం కాబోతున్న శైలిసింగ్!

2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ నుంచి మరో సంచలన అథ్లెట్‌ రాబోతోందా..? అంటే అవుననే సమాధానం లభిస్తోంది. ఎందుకంటే తాజాగా జరిగిన అండర్‌-20 ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో లాంగ్‌ జంపర్‌ శైలి సింగ్‌ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకోవడమే అందుకు కారణం. ఆదివారం నైరోబీలో జరిగిన ఈ పోటీల్లో శైలి త్రుటిలో స్వర్ణ పతకం కోల్పోయింది. కానీ, ఆమె భవిష్యత్తులో దేశం గర్వించదగ్గ అథ్లెట్‌గా ఎదగటం ఖాయంగా కనిపిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tokyo Paralympics: ఈ యోధుల కథలు వింటే జీవితంపై కొత్త ఆశలు!

8. Hashmat Ghani: అందుకే తాలిబన్ల ఆధిపత్యాన్ని అంగీకరించా!

అఫ్గానిస్థాన్‌లో అస్థిరత తొలగిపోవాలనే తాను తాలిబన్ల ఆధిపత్యాన్ని అంగీకరించినట్లు ఆ దేశ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ సోదరుడు, ప్రముఖ వ్యాపారవేత్త హష్మత్‌ ఘనీ పేర్కొన్నారు. అయితే తాలిబన్లకు తాను మద్దతు తెలపడం లేదన్నారు. భారత్‌కు తాలిబన్లతో రాజకీయ సంబంధాలు ఏర్పర్చుకోవడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. అష్రాఫ్‌ ఘనీ దేశం విడిచి వెళ్లినా ఆయన అక్కడే ఉండిపోయారు. సంధి కాలంలో దేశానికి తన వంతు సహాయసహకారాలు అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Evaru Meelo Koteeswarulu: ఒక్క సెకను ముందు చరణ్‌ చెప్పిన సమాధానమేంటో తెలుసా?

బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమం ఆదివారం నుంచి ప్రసారమవుతోంది. ఆట తీరు.. అందులో ఉండే విధివిధానాలను ప్రేక్షకులకు సులువుగా తెలియజేసేందుకు మొదటిగా కర్టన్‌రైజర్‌ ప్రసారం చేశారు. ఇందులో రామ్‌చరణ్‌ సందడి చేశారు. షోలో ఎంత గెలిస్తే అంత చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌కు విరాళంగా ఇచ్చేస్తానంటూ ఆయన ఆట మొదలు పెట్టారు. ఇప్పటివరకు రూ.80,000 వరకూ గెలుచుకుని ముందుకు సాగుతున్నారు. మరి, చరణ్‌ని తారక్‌ అడిగిన ప్రశ్నలేంటి.. వాటి సమాధానాలేంటి? ఓసారి తెలుసుకుందాం! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

SALAAR: ‘సలార్‌’ కీలక అప్‌డేట్‌

10. 4 రోజుల్లో వివాహం.. పెళ్లి పత్రికలు పంచేందుకు వెళుతూ దుర్మరణం

మరో నాలుగు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. అనంతపురం జిల్లా కదిరి మండలం ఎరుకలవాండ్లపల్లి సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఎర్రదొడ్డికి చెందిన మహేష్ (26) మృతి చెందాడు. ఈ నెల 27న కదిరిలో మహేశ్‌ వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి సమయం దగ్గర పడుతుండటంతో బంధువులకు వివాహ పత్రికలను పంచేందుకు స్వగ్రామం నుంచి అర్ధరాత్రి బయలుదేరిన మహేష్ కొద్ది సమయానికే గుర్తుతెలియని వాహనం ఢీకొని మృత్యువాత పడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని