Updated : 27 Feb 2022 13:15 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. Ukraine Crisis: స్విఫ్ట్‌ కత్తిని దూసిన అమెరికా మిత్రదేశాలు..!

రష్యా దురాక్రమణను అడ్డుకొనేందుకు  అమెరికా, పశ్చిమ దేశాలు కీలక చర్యలు చేపట్టాయి. అమెరికా, ఐరోపా సమాఖ్య, కెనడా, బ్రిటన్‌లు..  స్విఫ్ట్‌ (సొసైటీ ఫర్‌ వరల్డ్‌వైడ్‌ ఇంటర్‌బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ టెలికమ్యూనికేషన్స్‌) నుంచి రష్యాకు చెందిన కీలక బ్యాంకులను తొలగిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. దీంతో రష్యా బ్యాంకింగ్‌ రంగం అంతర్జాతీయ లావాదేవీలు నిర్వహించడం చాలా కష్టంగా మారిపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

రష్యాకు చైనా అండదండలు పరిమితమే

2. ఊళ్లను వదిలి వెళ్లినవారు తిరిగి వస్తున్నారు: మంత్రి జగదీశ్‌రెడ్డి

తెలంగాణలో ఆకలిని పారద్రోలాం అని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్లనే ఇది సాధ్యమయిందని చెప్పారు. ఊళ్లను వదిలి వెళ్లినవారు తిరిగి చేరుకుంటున్నారని మంత్రి తెలిపారు. నగరంలోని ఖైరతాబాద్‌ విశ్వేశ్వరయ్య భవన్‌లో నదుల పరిరక్షణపై రెండో రోజు జాతీయ సదస్సు కొనసాగుతోంది. సదస్సులో పాల్గొన్న జగదీశ్‌రెడ్డి మాట్లాడారు. ‘‘వానలను వాపసు తెచ్చుకోవాలంటే పచ్చదనం పెంచాలని సీఎం చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. India Corona : 10 వేలకు దిగొచ్చిన కొత్త కేసులు.. 1 శాతానికి తగ్గిన పాజిటివిటీ రేటు..

దేశంలో కరోనా మహమ్మారి క్రమంగా అదుపులోకి వస్తోంది. రోజువారీ కేసుల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా కొత్త కేసులు 10 వేలకు దిగిరావడం  ఊరట కలిగిస్తోంది. మరోవైపు మరణాలు కూడా 250లోపే నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 10,22,204 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 10,273 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఈ బస్సు టిక్కెట్టు రూ.15 లక్షలు

దిల్లీ నుంచి లండన్‌కి బస్సు అనగానే ఒకింత ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. రెండు ఖండాలు దాటి 18 దేశాల మీదుగా వెళ్లే ఆ బస్సు ఎక్కాలంటే వీసా కావాలా, టికెట్‌ ధర ఎంతుంటుందీ... వంటి ఎన్నో ప్రశ్నలు ఈ పాటికే బుర్రలోకి వచ్చి ఉంటాయి కదూ!  ఇదిగో చదివేయండి, లండన్‌ వెళ్లే ఆ ఎర్రబస్సు విశేషాలు... దిల్లీకి చెందిన అడ్వెంచర్స్‌ ఓవర్‌లాండ్‌ అనే సంస్థ  దిల్లీ-లండన్‌ బస్సు సర్వీసుకు శ్రీకారం చుట్టింది. దిల్లీ నుంచి బయల్దేరే ఆ బస్సు 20వేల కిలోమీటర్లు ప్రయాణించి లండన్‌కు చేరుకుంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Video: పదో తరగతికి ఫుల్‌స్టాప్‌.. ఆవిష్కరణకు నాన్‌స్టాప్‌

6. Ukraine Crisis: పుతిన్‌ ‘ఫాదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌’ను ప్రయోగిస్తారా?

ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యా తన వద్ద ఉన్న శక్తిమంతమైన ఆయుధం ‘ఫాదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌’ (ఎఫ్‌ఓఏబీ)ను బయటకు తీసే వీలుందన్న వార్తలు వస్తున్నాయి. ప్రత్యర్థి శిబిరాన్ని షాక్‌లో ముంచెత్తే వ్యూహంలో భాగంగా దీన్ని ప్రయోగించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అనుమతిచ్చినట్లు అవి పేర్కొన్నాయి. అణ్వస్త్రం కాకపోయినప్పటికీ ఆ స్థాయి విధ్వంసాన్ని మిగిల్చే ఈ బాంబుపై ఆందోళన వ్యక్తమవుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* రష్యాతో సైబర్‌ యుద్ధం చేస్తోన్న అనానమస్‌ హ్యాకర్లు..!

7. చిత్తు కాగితాలు సేకరిస్తుండగా పేలుడు.. మహిళ మృతి

చిత్తు కాగితాలు సేకరిస్తుండగా పేలుడు సంభవించి ఓ మహిళ మృతిచెందిన ఘటన రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మైలార్‌దేవ్‌పల్లి పరిధిలో ఈ ఉదయం దంపతులు చిత్తు కాగితాలు సేకరణకు వెళ్లారు. కాగితాలు సేకరిస్తున్న సమయంలో ఉన్నట్టుండి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మహిళ మృతిచెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Bheemlanayak: ‘భీమ్లానాయక్‌’ సూపర్‌ సక్సెస్‌.. పవన్‌కల్యాణ్‌ గ్రాండ్‌ పార్టీ

బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లతో బ్లాక్‌బస్టర్‌ విజయం అందుకున్న పవర్‌ప్యాక్డ్‌ మూవీ ‘భీమ్లానాయక్‌’. ప్రస్తుతం ఈ చిత్రబృందం సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తోంది. తమకు ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ థ్యాంక్స్‌ చెబుతూ శనివారం ఉదయం టీమ్‌ మొత్తం ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. ఇదిలా ఉండగా.. నిన్న సాయంత్రం ‘భీమ్లానాయక్‌’ టీమ్‌ మొత్తానికి పవన్‌ కల్యాణ్‌, త్రివిక్రమ్‌ కలిసి ఓ గ్రాండ్‌ పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Ukraine Crisis: ఉక్రెయిన్‌కు బాసటగా ఎలాన్‌ మస్క్‌.. ఏం చేశారంటే?

రష్యా దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉక్రెయిన్‌కు బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ బాసటగా నిలిచారు. స్టార్‌లింక్‌ శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవల్ని ప్రారంభించి నిరంతరాయ ఇంటర్నెట్‌ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. మరిన్ని టెర్మినళ్లను సైతం ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. రష్యా దాడులు ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్‌లో ఇంటర్నెట్‌ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ సమయంలో అక్కడి ప్రజలకు కీలక సమాచారం చేరవేయడం ఎంతో కీలకం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. దిగ్విజయంగా దూసుకుపోతున్న రోహిత్‌ శర్మ.. టీ20ల్లో సరికొత్త రికార్డు

టీ20 క్రికెట్‌లో టీమ్‌ఇండియా దూసుకుపోతోంది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ జట్లతో ఓటముల తర్వాత వరుసగా 11 మ్యాచ్‌లు గెలిచి పొట్టి ఫార్మాట్‌లో దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ నంబర్‌ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక తాజాగా శనివారం రాత్రి ధర్మశాలలో శ్రీలంకతో జరిగిన రెండో టీ20లోనూ భారత్‌ గెలవడంతో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కొత్త రికార్డు నెలకొల్పాడు. స్వదేశంలో అత్యధిక టీ20లు గెలిచిన సారథిగా నిలిచాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Dhoni: ఓ ప్రోమో కోసం.. గుర్తుపట్టలేని విధంగా ధోనీ..!Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని