Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు

Published : 01 Sep 2022 12:59 IST

1. ‘లైగర్‌’పై తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్‌ కామెంట్స్‌

విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘లైగర్‌’ (Liger) రిజల్ట్‌పై ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Tammareddy Bharadwaja) షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఎగిరెగిరిపడితే ఇలాంటి అనుభవాలే ఎదురవుతాయని ఆయన అన్నారు. మన యాక్షన్‌ పైనే ప్రేక్షకుల రియాక్షన్‌ ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ‘‘సినిమా అనే కాదు ఏ విషయంలోనూ ఎగిరెగిరిపడొద్దు. అలా చేస్తే ఇలాంటి ఎదురుదెబ్బలే తగులుతాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

 2. LAC: భారత్‌-చైనా సైనికాధికారుల స్థాయి చర్చలు

వాస్తవాధీన రేఖ వద్ద పలు చోట్ల నెలకొన్న ఘర్షణాత్మక వాతావరణాన్ని చల్లబర్చేందుకు భారత్‌-చైనా సైనికాధికారులు నిన్న చర్చలు జరిపారు. మేజర్‌ జనరల్‌ స్థాయి అధికారులు వీటిల్లో పాల్గొన్నారు. దెమ్‌చోక్‌ వద్ద భారత పశువుల కాపర్లను పీఎల్‌ఏ దళాలు అడ్డుకొంటున్న సమయంలో ఈ చర్చలు జరగడం గమనార్హం. ఈ చర్చలపై ఇరు పక్షాల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రూ.2లక్షలతో ప్రారంభించి రూ.75కోట్ల టర్నోవర్‌..

ఆన్‌లైన్‌ బేకరీ వ్యాపారం ఆ ముగ్గురు మిత్రులకు కోట్లు కుమ్మరిస్తోంది. కేవలం రూ.2 లక్షలతో ప్రారంభించిన తమ వ్యాపారాన్ని అంచెలంచెలుగా విస్తరించుకుంటూపోతూ ఇప్పుడు రూ.75కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. గురుగ్రామ్‌లో మొదలైన వారి వ్యాపారం ఇప్పుడు అనేక నగరాలకు విస్తరించి విజయవంతంగా ముందుకు సాగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. IND vs HK : సూర్యకుమార్‌కు విరాట్ ‘టేక్‌ ఏ బౌ’.. వైరల్‌గా మారిన వీడియో!

సూర్యకుమార్‌ యాదవ్‌ బ్యాటింగ్‌కు పరుగుల రారాజు విరాట్ కోహ్లీ ఫిదా అయిపోయాడు. దీంతో సూర్యకుమార్‌ యాదవ్‌కి ‘టేక్‌ ఏ బౌ’ చెప్పాడు. ఈ ఘటన ఆసియా కప్‌లో భాగంగా హాంకాంగ్‌తో ఆడిన మ్యాచ్‌లో చోటుచేసుకొంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 192/2 భారీ స్కోరు సాధించింది. టీమ్‌ఇండియా భారీ స్కోరు సాధించడంలో సూర్యకుమార్‌ యాదవ్‌ (68*) కీలక పాత్ర పోషించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వాణిజ్య సిలిండర్‌ వినియోగదారులకు ఊరట..తగ్గిన ధర!

సెప్టెంబరు తొలిరోజే ప్రభుత్వరంగ చమురు విక్రయ సంస్థలు వంటగ్యాస్‌ వాణిజ్య సిలిండర్‌ వినియోగదారులకు ఊరటనిచ్చే వార్త చెప్పాయి. వాణిజ్య గ్యాస్‌ బండ ధరను రూ.100 వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అయితే, గృహ వినియోగ సిలిండర్‌ ధరల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మైనార్టీలపై చైనా క్రూరత్వం.. ఐరాస సంచలన నివేదిక

ఉగ్రవాద నిర్మూలన పేరిట చైనా తమ దేశంలోని మైనార్టీలపై మారణహోమానికి పాల్పడుతోందన్న అంతర్జాతీయ సమాజం ఆందోళన నిజమేనని తేలింది. షిన్‌జియాంగ్‌ ప్రాంతంలో వీగర్‌ ముస్లింలు, ఇతర మైనార్టీలపై చైనా హింసకు పాల్పడుతోందన్న ఆరోపణలు నమ్మదగినవేనని ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంఘం నివేదిక వెల్లడించింది. అక్కడ మనుషులపై దారుణమైన నేరాలు జరిగి ఉండొచ్చని అభిప్రాయపడింది. ఈ మేరకు బుధవారం సంచలన నివేదికను బయటపెట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. భారీ షాట్లు కొట్టడం వెనుకున్న సీక్రెట్‌ చెప్పిన సూర్యకుమార్ యాదవ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆసియా కప్‌లో భారత్‌ సూపర్‌-4 దశకు చేరుకొంది. తొలి మ్యాచ్‌లో పాక్‌ను ఓడించింది. ఇక బుధవారం హాంకాంగ్‌పై విజయం నమోదు చేసి తదుపరి దశకు దూసుకెళ్లింది. పాక్‌తో పెద్దగా రాణించని సూర్యకుమార్‌యాదవ్‌ హాంకాంగ్‌పై చెలరేగాడు. ఆరు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో నాలుగు సిక్సర్లు కొట్టడం విశేషం. దీంతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’గా ఎంపికయ్యాడు. ఇలా చెలరేగడం వెనుక ఉన్న సీక్రెట్‌ను సూర్యకుమార్‌ యాదవ్‌ వెల్లడించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. జియో 5G.. ఇప్పుడున్న అన్ని 5G ఫోన్లకూ పని చేస్తుందా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: దీపావళి నుంచి దేశంలో ఐదు నగరాల్లో 5జీ సేవలను ప్రారంభిస్తామని ఇటీవల జియో ప్రకటించింది. ఈ క్రమంలో SA సేవలు అందిస్తాం అని చెప్పింది. దీంతో ఈ SA (స్టాండ్‌ అలోన్‌) అంటే ఏంటి? NSA (నాన్‌ స్టాండ్‌ అలోన్‌) అంటే ఏమిటి? ఏయే మొబైల్స్‌కి జియో 5జీ సేవలు వస్తాయో ఓ లుక్కేయండి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అదుపులోనే కరోనా వ్యాప్తి.. కొత్త కేసులు ఎన్నంటే..?

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్తకేసులు పది వేలలోపే నమోదవుతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో దాదాపు 8వేల కేసులు నమోదవ్వగా.. క్రియాశీల కేసులు మరింత తగ్గడం ఊరటనిస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. SpiceJet: ‘ఆటోపైలట్’లో లోపం.. మరో స్పైస్‌జెట్‌ విమానం వెనక్కి..!

దిల్లీ: దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ను వరుస వైఫల్యాలు వేధిస్తున్నాయి. తాజాగా మరో విమానంలో సాంకేతిక లోపం బయటపడింది. దిల్లీ నుంచి మహారాష్ట్ర బయల్దేరిన ఓ విమానంలో ‘ఆటోపైలట్‌’ వ్యవస్థలో సమస్య తలెత్తింది. దీంతో ఆ విమానం అర్ధాంతరంగా వెనుదిరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని