Tammareddy Bharadwaj: ‘లైగర్’పై తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్ కామెంట్స్
విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘లైగర్’ (Liger) రిజల్ట్‌పై ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Tammareddy Bharadwaj) షాకింగ్ కామెంట్స్...
మనం చిటికెలేస్తే వాళ్లూ అలాంటి సమాధానమే ఇస్తారు
హైదరాబాద్: విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘లైగర్’ (Liger) రిజల్ట్‌పై ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Tammareddy Bharadwaja) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎగిరెగిరిపడితే ఇలాంటి అనుభవాలే ఎదురవుతాయని ఆయన అన్నారు. మన యాక్షన్ పైనే ప్రేక్షకుల రియాక్షన్ ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ‘‘సినిమా అనే కాదు ఏ విషయంలోనూ ఎగిరెగిరిపడొద్దు. అలా చేస్తే ఇలాంటి ఎదురుదెబ్బలే తగులుతాయి. ‘మేము ఎంతో కష్టపడి చిత్రాన్ని తెరకెక్కించాం. మా చిత్రాన్ని చూడండి’ అంటూ ఏ చిత్రబృందమైన తమ సినిమాని ప్రేక్షకుల్లో ప్రమోట్ చేసుకుంటే సరిపోతుంది. అంతేకానీ, నువ్వు చిటికెలు వేస్తే.. ప్రేక్షకులు ఇలాంటి సమాధానమే చెబుతారు’’ అని తమ్మారెడ్డి పేర్కొన్నారు.
విలేకరి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుదలై పరాజయాన్ని చవిచూసింది. ఈ సినిమా పరాజయానికి కారణాలు ఏమై ఉంటాయి?’’ అని ప్రశ్నించగా.. ‘‘ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడను. సాధారణంగా నేను పూరీ జగన్నాథ్ అభిమానిని. ఆయన సినిమాలంటే నాకెంతో ఇష్టం. కానీ, ‘లైగర్’ ట్రైలర్ చూసినప్పుడే చిత్రాన్ని చూడాలనిపించలేదు. ఒకవేళ భవిష్యత్తులో చూడాలనిపిస్తే చూస్తా’’ అని ఆయన చెప్పుకొచ్చారు. బాయ్‌కాట్ ట్రెండ్‌పైనా తమ్మారెడ్డి పెదవి విప్పారు. సోషల్‌మీడియా ఆదరణ పెరుగుతోన్న కొద్దీ ఇలాంటి ట్రెండ్స్ ప్రారంభమవుతున్నాయని అన్నారు. అలాంటి ట్రెండ్స్‌ని మొదలుపెట్టేవారు నాకు తెలిసినంత వరకూ సరిగ్గా సినిమాలు కూడా చూడరు. కాబట్టి, అలాంటి వాటిని పట్టించుకోకపోవడమే బెటర్ అని ఆయన సమాధానమిచ్చారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Gudivada Amarnath: త్వరలో విశాఖ భవిష్యత్తు మారుతుంది: మంత్రి అమర్నాథ్
-
Ap-top-news News
Taraka Ratna: మెదడు సంబంధిత సమస్య మినహా తారకరత్న క్షేమం: విజయసాయిరెడ్డి
-
India News
బడ్జెట్ అంశాలు లీకవడంతో.. పదవిని కోల్పోయిన ఆర్థిక మంత్రి
-
Sports News
Hanuma Vihari: విహారి ఒంటి చేత్తో.. మణికట్టు విరిగినా బ్యాటింగ్
-
Ts-top-news News
Samathamurthy: నేటి నుంచి సమతా కుంభ్ బ్రహ్మోత్సవాలు
-
Crime News
Crime News: పల్నాడు జిల్లాలో కాల్పుల కలకలం.. తెదేపా మండలాధ్యక్షుడికి గాయాలు