LAC: భారత్‌-చైనా సైనికాధికారుల స్థాయి చర్చలు

వాస్తవాధీన రేఖ వద్ద పలు చోట్ల నెలకొన్న ఘర్షణాత్మక వాతావరణాన్ని చల్లబర్చేందుకు భారత్‌-చైనా సైనికాధికారులు నిన్న చర్చలు జరిపారు. మేజర్‌ జనరల్‌ స్థాయి అధికారులు వీటిల్లో

Published : 01 Sep 2022 10:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వాస్తవాధీన రేఖ వద్ద పలు చోట్ల నెలకొన్న ఘర్షణాత్మక వాతావరణాన్ని చల్లబర్చేందుకు భారత్‌-చైనా సైనికాధికారులు నిన్న చర్చలు జరిపారు. మేజర్‌ జనరల్‌ స్థాయి అధికారులు వీటిల్లో పాల్గొన్నారు. దెమ్‌చోక్‌ వద్ద భారత పశువుల కాపర్లను పీఎల్‌ఏ దళాలు అడ్డుకొంటున్న సమయంలో ఈ చర్చలు జరగడం గమనార్హం. ఈ చర్చలపై ఇరు పక్షాల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇప్పటికే ఇరు పక్షాలు కోర్‌ కమాండర్‌ స్థాయిలో 16 విడతలు చర్చలు జరిపాయి. ఈ చర్చలు కొంత ఫలితాన్నిచ్చి పాంగాంగ్‌ సరస్సు, గోగ్రాపోస్టు వద్ద బలగాల ఉపసంహరణ జరిగింది. 

ఆసియా సొసైటీ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌లో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌ మాట్లాడుతూ.. భారత్‌-చైనా సరిహద్దులే ఇరు దేశాల సంబంధాలను ప్రతిబింబిస్తాయని వ్యాఖ్యానించారు. ఇక్కడ సంబంధాలు సాధారణ స్థితికి రావడానికి  పరస్పరం అర్థం చేసుకోవడం, గౌరవించుకోవడం, ప్రయోజనాలు కాపాడుకోవడం వంటివి జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. చర్చలకు ముందు జైశంకర్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకొన్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు