JIO 5G: జియో 5G.. ఇప్పుడున్న అన్ని 5G ఫోన్లకూ పని చేస్తుందా?

SA అంటే ఏంటి? NSA అంటే ఏమిటి? ఏయే మొబైల్స్‌కి జియో 5జీ సేవలు వస్తాయి

Updated : 01 Sep 2022 15:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దీపావళి నుంచి దేశంలో ఐదు నగరాల్లో 5జీ సేవలను ప్రారంభిస్తామని ఇటీవల జియో ప్రకటించింది. ఈ క్రమంలో SA సేవలు అందిస్తాం అని చెప్పింది. దీంతో ఈ SA (స్టాండ్‌ అలోన్‌) అంటే ఏంటి? NSA (నాన్‌ స్టాండ్‌ అలోన్‌) అంటే ఏమిటి? ఏయే మొబైల్స్‌కి జియో 5జీ సేవలు వస్తాయో ఓ లుక్కేయండి. 

  • యాపిల్‌ మొబైల్స్‌ జియో 5జీ పని చేస్తుందా అంటే.. 12 సిరీస్‌ మొబైల్స్‌ తర్వాత అన్నింటిలోనూ పని చేస్తుంది అని చెప్పేయొచ్చు. అంతకుముందు ఉన్న ఏ మొబైల్‌లోనూ జియో 5జీ సేవలు అందుబాటులో ఉండవు.  
  • యాపిల్‌ 13 సిరీస్‌ మొబైల్స్‌లో SA 5జీకి సంబంధించినంత వరకూ ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ 12 సిరీస్‌ మొబైల్స్‌లో నేరుగా SA 5జీ వస్తుందా లేదా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. 
  • శాంసంగ్‌ మొబైల్స్‌ SA 5జీ సేవలను వినియోగించుకోవచ్చు. అయితే అది అప్‌డేట్‌ రూపంలో వచ్చాకా? లేక అప్‌డేట్‌ రాకపోయినా అనేది తెలియాల్సి ఉంది. కొత్తగా వచ్చిన నథింగ్‌ మొబైల్‌ విషయంలో ఎలాంటి అప్‌డేట్లు లేకుండానే SA 5జీ సేవలు వినియోగించుకోవచ్చు. 
  • వన్‌ప్లస్‌ నుంచి వచ్చిన తొలి నార్డ్‌, నార్డ్‌ సీఈ మొబైల్స్‌లో N 78 బ్యాండ్‌ను వినియోగిస్తున్నారు. దీంతో వీటిలో జియో 5జీ వస్తుందా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు. అయితే వన్‌ప్లస్‌ 8, 8 ప్రో మొబైల్స్ స్పెసిఫికేషన్లు చూస్తే.. ఈ మొబైల్‌ 78 బ్యాండ్‌ను సపోర్టు చేస్తుందని, అయితే SA, NSA మోడ్‌ 5జీ సపోర్టు ఉంటుందని రాశారు. అయితే ఇది నేరుగానా, లేక అప్‌డేట్‌ ద్వారానా అనేది తెలియాలి. 
  • ఒప్పో మొబైల్స్‌లో ఎంట్రీ లెవల్‌లో ఉన్న A53s 5G లాంటివి SA, NSA నెట్‌వర్క్‌లను సపోర్టు చేస్తాయి. అయితే K10 5G and A74 మోడల్స్‌ విషయంలో ఏ నెట్‌వర్క్‌లు సపోర్టు చేస్తాయి అనే సమాచారం లేదు. రెనో సిరీస్‌లో అయితే 75జీ మాత్రమే SA, NSA నెట్‌వర్క్‌ను సపోర్టు చేస్తుంది. 
  • వన్‌ప్లస్‌ 9 సిరీస్‌, 10 సిరీస్‌ మొబైల్స్‌ అన్నీ SA, NSAను సపోర్టు చేస్తాయి అని సమాచారం. నార్డ్‌ 2: 5జీ, నార్డ్‌ సీఈ2 5జీ మొబైల్స్‌ మల్టిపుల్‌ 5జీ బ్యాండ్స్‌తో పని చేస్తాయి. 
  • షావోమి, రెడ్‌మీ, పోకో నుంచి ఇప్పటివరకు వచ్చిన 5జీ ఫోన్లలో జియో సేవలు అందుబాటులో ఉంటాయట. అయితే దీని కోసం జియో ఓటీఏ అప్‌డేట్‌ ద్వారా మొబైల్స్‌లో మార్పు చేస్తుంది. జియో ఇస్తామంటున్న SA బ్యాండ్‌ను సపోర్టు చేసేలా మొబైల్స్‌కు అప్‌డేట్‌ ఇస్తామని షావోమి టీమ్‌ వెల్లడించింది.
  • షావోమి 11 Lite NE 5G నుంచి షావోమి 12 Pro వరకు అన్ని మోడల్స్‌లో జియో 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి. రెడ్‌మీ సంగతి చూస్తే.. K50i 5G, Note 11T 5G మొబైల్స్‌ సపోర్టు చేస్తాయి. పోకోకు చెందిన M4 5G నుంచి X4 Pro 5G వరకు అన్ని మోడల్స్‌లో జియో 5జీ SA సేవలు లభిస్తాయి.
  • రియల్‌మీ నుంచి ఇప్పటివరకు వచ్చిన మొబైల్స్‌ SA బ్యాండ్స్‌, NSA బ్యాండ్స్‌ను సపోర్ట్‌ చేస్తాయని స్పెసిఫికేషన్స్‌లో రాశారు. ఆ లెక్కన రియల్‌ మీ 9i 5G,  9 Pro Plus 5G, 9 Pro 5G, GT సిరీస్‌ మొబైల్స్‌లో జియో 5జీ సేవలు అందుబాటులో ఉంటాయి. అయితే నేరుగా వాడేయొచ్చా లేక.. ఏమైనా ఓటీఏ అప్‌డేట్‌ ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. రియల్‌మీ నార్జో 30 5G, రియల్‌మీ X7 5G మొబైల్స్‌ సంగతిపై క్లారిటీ రావాల్సి ఉంది. 
  • వివో దగ్గరికొస్తే.. టీ1 ప్రో, వి 25, ఎక్స్‌ 80 సిరీస్‌ మొబైల్స్‌ SA, NSA నెట్‌వర్క్‌ బ్యాండ్స్‌ను సపోర్టు చేస్తాయి. అయితే SA బ్యాండ్‌ వాడాలంటే సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ ద్వారానే సాధ్యమవుతుందట. అలాగే Y72 మొబైల్‌కి కూడా దీని కోసం ఓ అప్‌డేట్‌ విడుదల చేస్తారట. 

ఏమిటీ SA, NSA?

SA అంటే పూర్తి స్థాయిలో 5జీ నెట్‌వర్క్‌ కోసం అందుబాటులో ఉన్న నెట్‌వర్క్‌. అంటే బేస్‌ స్టేషన్‌ నుంచి రేడియో యాంటెనా వరకు అన్నీ 5జీ స్పెసిఫకేషన్లతో రూపొందిస్తారు. డేటా, వాయిస్‌ 5జీ రేడియోలతో పని చేస్తాయి. అదే NSA అంటే 4జీ కోసం రూపొందించిన లేదా 4జీ ఆధారిత 5జీ సర్వీసు అనుకోవచ్చు. 4జీ ఎక్విప్‌మెంట్‌తో 5జీ సేవలను అందిస్తారన్నమాట. SA నెట్‌వర్క్‌ విషయంలో ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో వేగమూ ఎక్కువగా ఉంటుంది. కానీ, NSA దగ్గరకు వచ్చేసరికి ఖర్చు తగ్గుతుంది, అలాగే వేగమూ తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వాయిస్‌ క్వాలిటీ కాస్త తగ్గే అవకాశం ఉంది అంటున్నారు. అయితే సాంకేతికత ఉపయోగించి SA నెట్‌వర్క్‌కు NSA నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్‌ చేసే అవకాశం ఉందంటున్నారు. 

ఎప్పుడు వస్తుంది?

5జీ సేవలకు సంబంధించి రిలయన్స్‌ ఇటీవల ముఖ్య వివరాలు వెల్లడించింది. కంపెనీ 45వ వార్షిక సాధారణ సమావేశంలో ఈ మేరకు ముకేశ్‌ అంబానీ కీలక ప్రకటన చేశారు.  దీపావళి నాటికి దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా నగరాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. ప్రతి నెలా ఈ సేవలను విస్తరిస్తామని తెలిపారు. 2023 డిసెంబర్‌ నాటికి దేశంలోని ప్రతి పట్టణం, ప్రతి మండలంలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని