Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 10 Nov 2022 12:58 IST

1. ED Raids: తెరాస ఎంపీ నివాసంలో ఈడీ సోదాలు

హైదరాబాద్‌: తెరాస రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీలోని ఆయన ఇంట్లో గురువారం ఉదయం నుంచి ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. గ్రానైట్ వ్యాపారాలతో ఎంపీ రవిచంద్రకు సంబంధమున్న నేపథ్యంలో ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. బుధవారం తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు మరికొందరు గ్రానైట్‌ వ్యాపారుల ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Delhi liquor scam: దిల్లీ మద్యం కుంభకోణం.. మరో ఇద్దరు తెలుగు వాళ్లు అరెస్టు

దిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దూకుడు పెంచింది. మద్యం వ్యాపారంతో సంబంధం ఉన్న మరో ఇద్దరిని అరెస్టు చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పెన్నాక శరత్‌ చంద్రారెడ్డి, మరో మద్యం వ్యాపారి వినయ్‌బాబును అరెస్టు చేసినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఇద్దరికి రూ.కోట్ల విలువైన మద్యం వ్యాపారం ఉందని ఈడీ పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. IND vs ENG: భారత్‌ X ఇంగ్లాండ్‌.. ‘విజయ’విహారం చేసిందెవరు?

టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో ఉత్తమ ప్రదర్శనతో జోరుమీదున్న టీమ్‌ఇండియా మెగా టైటిల్‌ ఆశలను నిలుపుకోవాలంటే.. గురువారం జరిగే సెమీస్‌లో ఇంగ్లీష్‌ జట్టు పని పట్టాల్సిందే. అయితే అది రోహిత్‌ సేనకు కఠిన సవాలే. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఫేవరెట్‌గా కన్పిస్తున్నా.. ఇంగ్లాండ్‌ను తక్కువ అంచనా వేయలేం. అంతర్జాతీయ టీ20ల్లో భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య పోరు రికార్డు గట్టిగా ఉంది. గతంలో ఇరు జట్ల ప్రదర్శనలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Hombale Films: ఆ ఒక్క ఫ్లాప్.. ‘కేజీయఫ్‌’, ‘కాంతార’లకు కారణమైంది..‘హోంబలే’ జర్నీ

ఒకప్పుడు.. నిర్మాతే దేవుడు. ఎంత గొప్ప నటుడైనా, దర్శకుడైనా నిర్మాత మాటను జవదాటేవారు కాదు. విజయ, ఏవీఎం, సురేశ్‌ ప్రొడక్షన్స్‌, ఉషాకిరణ్‌ మూవీస్‌ తదితర నిర్మాణ సంస్థలు అత్యధిక విజయవంతమైన చిత్రాలు నిర్మించాయంటే సినిమాపై ఆ నిర్మాతలకు ఉన్న అభిరుచి, నిర్మాణ వ్యయం పట్ల అవగాహన, నటీనటులు-సాంకేతిక నిపుణులపై ఉన్న పట్టే కారణం. వరుస సినిమాలతో దూసుకెళ్తోన్న ‘హొంబలే’ ప్రయాణాన్ని ఓ సారి చూద్దాం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Sukesh Chandrashekhar: నన్నూ నా భార్యను హింసించి చంపేస్తారు..!

తనకు, తన భార్యకు ప్రాణహాని ఉందని ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్.. దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ వీకే సక్సేనాకు మరోమారు లేఖ రాశాడు. తమని చిత్రహింసలకు గురిచేసి చంపేస్తారని ఆందోళన వ్యక్తం చేశాడు. ఆప్‌ నేతలపై చేసిన ఫిర్యాదులను వెనక్కి తీసుకోవాలంటూ జైల్లో వేధిస్తున్నారని, దిల్లీ వెలుపుల ఉన్న వేరే జైలుకు తమను తరలించాలని కోరాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Elon Musk: మస్క్‌ విదేశీ సంబంధాలను ఓ చూపు చూడొచ్చు.. బైడెన్‌ నర్మగర్భ వ్యాఖ్యలు

ట్విటర్‌ అధిపతి ఎలాన్‌ మస్క్‌కు ఇతర దేశాలతో ఉన్న సంబంధాల వల్ల.. జాతీయ భద్రతకు ఏమైనా ఇబ్బంది వాటిల్లుతుందేమో పరిశీలించాల్సిన అవసరం ఉందని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ వాఖ్యానించారు. ట్విటర్‌ కొనుగోలులో సౌదీకి చెందిన ఓ సంస్థ నుంచి మస్క్‌ సాయం తీసుకోవడం దేశ భద్రతకు ముప్పా..? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బైడెన్‌ ఈ విధంగా స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. TRS MLAs Bribing case: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. నిందితులను ప్రశ్నిస్తున్న సిట్‌ అధికారులు

ఎమ్మెల్యేలకు ఎర కేసులో ముగ్గురు నిందితులను మొయినాబాద్‌ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్‌ను చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకొని రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. భారీ భద్రత నడుమ చంచల్‌గూడ జైలు నుంచి  నిందితులను తరలించారు. బయటకు కనిపించడకుండా బ్లాక్‌ ఫిల్మ్‌ ఉన్న వాహనంలో వారిని తీసుకెళ్లారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. BSNL 4G: 2022 ఆఖరు కల్లా దేశవ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సేవలు

‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS)’తో రూ.26,281 కోట్ల ఒప్పందం చేసుకోవడానికి బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL)కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా 4జీ సేవల్ని (4G Services) ప్రారంభించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌కు మార్గం సుగమమైంది. ఒప్పందంలో భాగంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ కోసం టీసీఎస్‌ 4జీ లైన్లను ఏర్పాటు చేసి 9 ఏళ్ల పాటు నిర్వహించనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి9. 

9. Babar Azam: ‘ఫైనల్‌కు భారత్‌ వస్తే..?’ విలేకరి ప్రశ్నకు బాబర్‌ సమాధానమిదే..!

అంచనాలను తలకిందుల చేస్తూ టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో అడుగుపెట్టింది పాకిస్థాన్‌. గురువారం జరిగే రెండో సెమీస్‌లో భారత్‌ గెలిస్తే.. చిరకాల ప్రత్యర్థుల రసవత్తర టైటిల్‌ మ్యాచ్‌ను చూడొచ్చు. ఒక వేళ భారత్‌ ఫైనల్‌కు వస్తే.. దాయాదుల పోరులో ఆటగాళ్లపై ఒత్తిడి ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ విలేకరి పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ను ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. The Vaccine War: కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ మరో సంచలన చిత్రం.. ‘ది వాక్సిన్ వార్’

కశ్మీర్ ఫైల్స్ చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఓ ఆసక్తికర ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన దర్శకత్వంలో పట్టాలెక్కుతున్న మరో సంచలన చిత్రం ‘ది వాక్సిన్ వార్’. కరోనా మహమ్మారి, లాక్‌డౌన్, ప్రజలు పడిన ఇబ్బందులు, వాక్సిన్ కోసం పడిగాపులు ఇలా ప్రతి అంశాన్ని ఈ చిత్రంలో చూపించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని