Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 25 Nov 2022 13:03 IST

1. ఆఫ్తాబ్‌ క్రూరత్వానికి హద్దేలేదు..!

శ్రద్ధావాకర్‌ హత్యకేసుకు సంబంధించి ఆఫ్తాబ్‌కు తాజాగా నిర్వహించిన పాలీగ్రాఫ్‌ పరీక్ష ద్వారా పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. దిల్లీలోని రోహిణీలో ఉన్న ఫోరెన్స్‌ సైన్స్‌ లేబోరేటరీని ఇందుకు వినియోగించారు. నిన్న ఉదయం 12 గంటల సమయంలో ఈ పరీక్ష మొదలుపెట్టారు. పోలీసులు హిందీలో ప్రశ్నలు అడగ్గా.. అతడు ఇంగ్లిష్‌లో సమాధానాలు చెప్పాడు. ఈ క్రమంలో శ్రద్ధాతో సంబంధం, ఆమె హత్యకు దారితీసిన పరిణామాలు, నేరం ఎప్పుడు జరిగింది, శరీర భాగాలను ఎక్కడెక్క పారేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అనుమతి లేనిదే.. అమితాబ్‌ బచ్చన్‌ పేరు, ఫొటో వాడకూడదు

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ వ్యక్తిగత హక్కులపై దిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నటుడి అనుమతి లేకుండా ఏ వ్యక్తి గానీ, సంస్థ గానీ ఆయన పేరు, ఫొటో, గళాన్ని ఉపయోగించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అమితాబ్‌ వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా ఉన్న కంటెంట్‌ను తొలగించాలని ఐటీ శాఖ అధికారులు, టెలికాం సర్వీసు ప్రొవైడర్లను ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఉమ్రాన్‌ మాలిక్‌కే మరో వికెట్‌.. కివీస్‌ స్కోరు 96/3 (22 ఓవర్లు)

ఉమ్రాన్‌ మాలిక్‌ జోరు కొనసాగుతోంది. తొలి వన్డేలోనే తన రెండో వికెట్‌ను తీశాడు. డారిల్‌ మిచెల్‌ (11) షాట్‌కు యత్నించి సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్ దీపక్ హుడా చేతికి చిక్కాడు. దీంతో 19.5 ఓవర్లలో కివీస్‌ 88 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. మరోవైపు కెప్టెన్‌ కేన్ విలియమ్సన్ (31*) క్రీజ్‌లో పాతుకుపోయాడు. ప్రస్తుతం కివీస్‌ 22 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. ఇంకా 211 పరుగులు చేస్తే కివీస్‌ విజయం సాధిస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మూలధన లాభాల పన్ను హేతుబద్ధీకరణకు కేంద్రం యోచన

దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను నిర్మాణాన్ని హేతుబద్ధీకరించే అంశాన్ని కేంద్ర ఆర్థికశాఖ పరిశీలిస్తున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సారూప్యత ఉన్న ఆస్తుల మధ్య సమానత్వం, ఇండెక్సేషన్‌ లాభాల మదింపు ప్రాతిపదిక సంవత్సరాన్ని సమీక్షించడం వంటి మార్పులు చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఒక ఏడాది కంటే ఎక్కువకాలం అట్టిపెట్టుకొని ఉన్న షేర్లపై 10 శాతం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను విధిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రుషికొండ పర్యటనకు సీపీఐ నారాయణ.. ఆ మార్గంలో పోలీసుల ఆంక్షలు

విశాఖలోని రుషికొండ వైపు వెళ్లే అన్ని మార్గాలను పోలీసులు దిగ్బంధించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ రుషికొండ పర్యటనకు బయల్దేరిన నేపథ్యంలో పోలీసులు ఈ ఆంక్షలు విధించారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనదారులను నిలిపేస్తున్నారు. కోర్టు అనుమతి మేరకు నారాయణ ఒక్కరినే రుషికొండ పర్యటనకు అనుమతిస్తామని చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. జడ్జిల బదిలీ ప్రతిపాదన.. వివక్షకు సంకేతం: హైకోర్టు న్యాయవాదుల ఆందోళన

ఏపీ హైకోర్టుకు చెందిన న్యాయమూర్తుల బదిలీలను నిరసిస్తూ న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నుంచి న్యాయమూర్తులు జస్టిస్‌ బట్టు దేవానంద్‌, జస్టిస్‌ డి. రమేశ్‌ బదిలీ సరికాదన్నారు. ఈ మేరకు హైకోర్టులో విధులు బహిష్కరించి న్యాయవాదులు నిరసన తెలిపారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ ప్రతిపాదన వివక్షకు సంకేతమని ఆరోపించారు. గుజరాత్‌ హైకోర్టు న్యాయమూర్తి బదిలీని వెనక్కి తీసుకున్నారని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఫ్రాన్స్‌ ఫుట్‌బాల్‌ చరిత్రను తిరగరాసిన గోల్డెన్‌ గోల్‌..!

1998 ప్రపంచకప్‌లో తొలిసారి గోల్డెన్‌గోల్‌ నిబంధన ప్రవేశపెట్టారు. ఫ్రాన్స్‌ ఈ నిబంధనను అద్భుతంగా అందిపుచ్చుకొని ఏకంగా ప్రపంచకప్‌నే ఒడిసిపట్టింది. మ్యాచ్‌ సమయంలో ఇరుపక్షాలు సమ ఉజ్జీలుగా ఉంటే.. రెండు సార్లు 15 నిమిషాల చొప్పున సమయం కేటాయిస్తారు. ఆ సమయంలో ఎవరు ముందు గోల్‌ కొడితే వారిని విజేతగా ప్రకటిస్తూ మ్యాచ్‌ను తక్షణమే ముగించేసేవారు. ఈ గోల్‌ను ‘గోల్డెన్‌ గోల్‌’గా వ్యవహరిస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కివీస్‌పై హాఫ్ సెంచరీ.. దిగ్గజాల సరసన శిఖర్‌ ధావన్‌

న్యూజిలాండ్‌తో సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న శిఖర్ ధావన్‌ (72) తొలి మ్యాచ్‌లో అర్ధశతకం సాధించాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (50)తో కలిసి తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నిర్మించాడు. ఈ క్రమంలో శిఖర్ ధావన్‌ మరో మైలురాయిని అందుకొన్నాడు. ధావన్ 43 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లిస్ట్‌ - A క్రికెట్‌లో 12వేల పరుగుల మార్క్‌ను తాకిన ఏడో భారత బ్యాటర్‌గా అవతరించాడు. ధావన్‌ 297 మ్యాచుల్లో 12,025 పరుగులతో కొనసాగుతున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రివ్యూ: తోడేలు

భాష‌ల మ‌ధ్య హ‌ద్దులు చెరిగిపోయాయి. సినిమా బాగుందంటే చాలు ఎవ‌రు న‌టించారు?ఎక్కడి నుంచి వ‌చ్చింద‌నే విష‌యాల్ని ప‌ట్టించుకోకుండా చూస్తున్నారు ప్రేక్షకులు. ఇప్పుడు ఏ భాష నుంచి ఏ సినిమా వ‌చ్చి వ‌సూళ్లు కొల్లగొడుతుందో ఊహించ‌లేం. అందుకే సినిమా బృందాలు కూడా.. అంద‌రికీ క‌నెక్ట్ అయ్యే క‌థ అనిపించిందంటే ప‌లు భాష‌ల్లో విడుద‌ల చేయ‌డానికి సిద్ధమ‌వుతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థలు కూడా వాటిని విడుద‌ల చేయ‌డానికి అంతే ఆస‌క్తిని ప్రద‌ర్శిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఎలాన్‌ మస్క్‌ మరో నిర్ణయం.. ఆ ఖాతాలకు ‘క్షమాభిక్ష’

ట్విటర్‌లో పలు మార్పులు తీసుకొస్తున్న కొత్త యజమాని ఎలాన్‌ మస్క్‌ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పలు కారణాలతో గతంలో నిలిపివేసిన ఖాతాలకు ‘క్షమాభిక్ష’ పెడుతున్నట్లు ప్రకటించారు. వచ్చేవారం నుంచే ఆ ఖాతాల పునరుద్ధరణ ప్రక్రియ మొదలుపెట్టనున్నట్లు ట్విటర్‌లో వెల్లడించారు. ట్విటర్‌లో నిలిపివేసిన ఖాతాలకు ‘క్షమాభిక్ష’ పెట్టాలా? వద్దా? అన్నదానిపై మస్క్‌ గురువారం పోలింగ్‌ నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని