Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 15 Mar 2023 09:07 IST

1. ఒక్క టికెట్‌ దొరికితే చాలు

ఈ నెల 19న వన్డే క్రికెట్‌ మ్యాచ్‌. అందులోను అభిమానించే క్రికెట్‌ హీరోలు వస్తున్నారు. వారిని చూసేందుకు ఎలాగైనా స్టేడియానికి వెళ్లాల్సిందే...అందుకు టికెట్‌ సంపాదించాల్సిందేనని వందలాది మంది అభిమానులు మంగళవారం ఆఫ్‌లైన్‌లో టికెట్లు విక్రయించే కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ఎటుచూసినా అభిమానుల కోలాహలం కనిపించింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

2.  NTR: హైదరాబాద్‌కు ఎన్టీఆర్‌.. ‘ఆస్కార్‌’ వేడుకపై ఆసక్తికర వ్యాఖ్యలు

‘ఆస్కార్‌’ (Oscars 2023) అవార్డుల ప్రదానోత్సవం అనంతరం తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ (NTR). బుధవారం తెల్లవారుజామున శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ ఆస్కార్‌ వేడుకపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌  చేయండి

 

3. వాట్సప్‌ ట్రిక్కులు వారెవ్వా!

నేటి టెక్నాలజీ యుగంలో తక్షణ సందేశాల వేదికలు ఎంత ఆదరణ పొందుతున్నాయో! వీటిల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది వాట్సప్‌ గురించే. సందేశాల చేరవేత, భావ వ్యక్తీకరణలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. అందుకే నిత్య జీవన వ్యవహారాల్లో విడదీయలేని భాగంగానూ మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా నెలకు 224 కోట్ల మంది.. మనదేశంలో సుమారు 49 కోట్ల మంది వాట్సప్‌ను వాడుతున్నారు! అయినప్పటికీ దీనిలోని కొన్ని ఫీచర్లు ఇప్పటికీ చాలామందికి తెలియవు. అలాంటి కొన్నింటి వివరాలు ఇవీ.. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. నోటికి తాళం వేద్దాం..

బరువు అదుపులో ఉంచుకోవడానికి కఠిన ఆహార నియమాలు పాటించాలి అనుకుంటాం. కొద్దిరోజులకే మనసు చిరుతిళ్లపైకి మళ్లుతుంటుంది. ఒకటి, అరా తీసుకుంటే సరే! పరిధి దాటుతుంటే ఇక డైట్‌ కొనసాగేదెలా? ఈ సమస్యకి చెక్‌ పెట్టాలా? పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. జియో ప్లస్‌ పోస్ట్‌పెయిడ్‌ పథకాలు

జియో ప్లస్‌ పేరిట పోస్ట్‌పెయిడ్‌ (నెలవారీ అద్దెపై లభించే) కుటుంబ పథకాలను రిలయన్స్‌ జియో తీసుకొచ్చింది. ఇందులో భాగంగా నలుగురు సభ్యులు కలిగిన కుటుంబానికి ఒక నెల పాటు ఉచిత సేవలు అందించనుంది. కుటుంబ పథకాల నెల అద్దె రూ.399 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఒక్కో సిమ్‌కు రూ.99 చెల్లించి మరో 3 కనెక్షన్‌లు తీసుకోవచ్చు. వినియోగదారులు కూడా సిమ్‌ మార్చుకోకుండానే పోస్ట్‌పెయిడ్‌ ఉచిత ట్రయల్‌ పథకానికి అప్‌గ్రేడ్‌ చేసుకోవచ్చు. ఈ పథకం కింద ఫ్యాన్సీ నంబర్లు కూడా ఇస్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. TS: మండే వేసవి ముందుంది.. ఏర్పాట్లు చేయండి

రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరగడం, వడగాడ్పులకు అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులను రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ జి.శ్రీనివాసరావు ఆదేశించారు. జూన్‌ వరకు ఎండల తీవ్రత కొనసాగితే జులై వరకు ప్రత్యేక చర్యలను కొనసాగించాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో సూచించిన మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. గ్రాము బంగారంలో ఒదిగిన ఆస్కార్‌

ప్రపంచాన్ని ఉర్రూతలూగించి ఆస్కార్‌ పురస్కారాన్ని కైవసం చేసుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోని నాటు.. నాటు.. పాటకు పెద్దాపురం పట్టణానికి చెందిన సూక్ష్మ వస్తువుల తయారీదారు, గిన్నీస్‌బుక్‌ రికార్డు గ్రహీత తాళాబత్తుల సాయి తనదైన శైలిలో పట్టం కట్టారు. ఒక గ్రాము బంగారంతో సూక్ష్మ ఆస్కార్‌ ప్రతిమను మంగళవారం తీర్చిదిద్దారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. చాలా బాధపడ్డా

సుదీర్ఘ కాలం టెస్టు శతకం చేయకపోవడం వల్ల తాను ఎంతో బాధపడ్డానని టీమ్‌ ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు. అంచనాల భారాన్ని తట్టుకోవడం కష్టమైందని చెప్పాడు. మూడేళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. ఆస్ట్రేలియాతో డ్రాగా ముగిసిన నాలుగో టెస్టులో కోహ్లి 28వ టెస్టు శతకం సాధించిన సంగతి తెలిసిందే. ‘‘నా లోపాల వల్ల సమస్యలు పెంచుకున్నా. ఎలాగైనా సెంచరీ చేయాలన్న తపన బ్యాటర్‌ను దెబ్బతీస్తుంది’’ అని కోహ్లి చెప్పాడు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. రాజుకుంటున్న రాజకీయ వేఢీ

అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఉమ్మడి జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ దఫా ఎలాగైనా గెలిచి తీరాలనే ఉద్దేశంతో గత కొన్ని రోజుల నుంచి అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తుండగా.. ఆయా పార్టీల్లోని అంతర్గత కుమ్ములాటలు అడ్డంకిగా నిలుస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల్లో దాదాపు సగం కంటే ఎక్కువ వాటిల్లో అధికార పార్టీకి అసమ్మతి సెగలు తలనొప్పిగా మారుతుండగా.. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. యూట్యూబ్‌ మజాగా

స్మార్ట్‌ఫోన్‌లో రోజూ యూట్యూబ్‌ వీడియోలు చూస్తూనే ఉంటాం. ఈ యాప్‌లో బోలెడన్ని ఫీచర్లున్నాయి. కాకపోతే ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌ తెరల మాదిరిగా కాకుండా ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో స్క్రీన్‌ చిన్నగా ఉండటం వల్ల చాలా ఫీచర్లు అదృశ్యంగానే ఉంటాయి. వీటి గురించి తెలుసుకుంటే మరింత తేలికగా యూట్యూబ్‌ను వాడుకోవచ్చు. అవేంటో తెలుసుకుందామా.. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని