logo

గ్రాము బంగారంలో ఒదిగిన ఆస్కార్‌

ప్రపంచాన్ని ఉర్రూతలూగించి ఆస్కార్‌ పురస్కారాన్ని కైవసం చేసుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోని నాటు.. నాటు.. పాటకు పెద్దాపురం పట్టణానికి చెందిన సూక్ష్మ వస్తువుల తయారీదారు, గిన్నీస్‌బుక్‌ రికార్డు గ్రహీత తాళాబత్తుల సాయి తనదైన శైలిలో పట్టం కట్టారు.

Published : 15 Mar 2023 05:50 IST

పెద్దాపురం: ప్రపంచాన్ని ఉర్రూతలూగించి ఆస్కార్‌ పురస్కారాన్ని కైవసం చేసుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోని నాటు.. నాటు.. పాటకు పెద్దాపురం పట్టణానికి చెందిన సూక్ష్మ వస్తువుల తయారీదారు, గిన్నీస్‌బుక్‌ రికార్డు గ్రహీత తాళాబత్తుల సాయి తనదైన శైలిలో పట్టం కట్టారు. ఒక గ్రాము బంగారంతో సూక్ష్మ ఆస్కార్‌ ప్రతిమను మంగళవారం తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 మిల్లీమీటర్ల పొడవైన ప్రతిమను రెండు గంటల పాటు శ్రమించి తయారు చేసినట్లు పేర్కొన్నారు. యావత్‌ తెలుగువారందరూ గర్వపడేలా చిత్రాన్ని తీర్చిదిద్దిన దర్శకుడు ఎస్‌ఎస్‌రాజమౌళి, సంగీత దర్శకుడు ఎంఎంకీరవాణి, పాట రచయిత చంద్రబోస్‌, నటులు రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌తో పాటు యూనిట్‌కి ఆయన అభినందనలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని