NTR: హైదరాబాద్‌కు ఎన్టీఆర్‌.. ‘ఆస్కార్‌’ వేడుకపై ఆసక్తికర వ్యాఖ్యలు

‘ఆస్కార్‌’ (Oscars) అవార్డుల కోసం మన దేశం తరఫు నుంచి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) టీమ్‌ ఇటీవల లాస్‌ఏంజిల్స్‌ వెళ్లిన విషయం తెలిసిందే. అవార్డును అందుకున్న అనంతరం ఒక్కొక్కరిగా స్వదేశానికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే నేడు ఎన్టీఆర్‌ (NTR) హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు.

Updated : 15 Mar 2023 09:46 IST

హైదరాబాద్‌: ‘ఆస్కార్‌’ (Oscars 2023) అవార్డుల ప్రదానోత్సవం అనంతరం తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ (NTR). బుధవారం తెల్లవారుజామున శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ ఆస్కార్‌ వేడుకపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) బృందం ఆస్కార్‌ అందుకున్న క్షణాలను తాను ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పారు.

‘‘ఆస్కార్‌ (Oscars 2023) వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా అనిపించింది. స్టేజ్‌పై కీరవాణి, చంద్రబోస్‌ నిల్చొని అవార్డును తీసుకున్న ఆ క్షణాలను ఎప్పటికీ మరిచిపోను. అదే నా బెస్ట్‌ మూమెంట్‌. మన దేశం మాదిరిగానే ఆ అవార్డు ఎంతో గొప్పగా ఉంది. అదొక అద్భుతమైన అనుభవం. దాన్ని మాటల్లో వర్ణించలేను. భారతీయుడిని.. అందులోనూ తెలుగువాడిని అయినందుకు గర్వపడుతున్నా. మేము ఇంతటి గౌరవాన్ని  దక్కించుకున్నామంటే దానికి కారణం అభిమానులు, సినీ ప్రియులు. వాళ్ల ప్రేమ, ఆశీస్సుల వల్లే ఈ అవార్డు సాధ్యమైంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను ప్రోత్సహించిన ప్రతి భారతీయుడు, సినీ ప్రియుడికి నా కృతజ్ఞతలు. ‘ఆస్కార్‌’ అవార్డు వచ్చిన వెంటనే మొదటిగా నా భార్యకు ఫోన్‌ చేసి ఆనందాన్ని పంచుకున్నా’’ అని ఎన్టీఆర్‌ వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని