Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 10 Jan 2022 09:06 IST

1. వేల కోట్ల అప్పులకు వారసురాలైంది

మాజీ సీఎం కూతురు, ప్రముఖ వ్యాపారవేత్త భార్య.. అదృష్టవంతురాలు అనేస్తాం కదా! ఇంకో కోణంలో చూద్దాం. జీవితంలో స్థిరపడని పిల్లలు. భర్త ఆత్మహత్య! దారి తెన్నూ లేని వ్యాపారాలు, వేల కోట్ల అప్పు.. ఇప్పుడేం అనిపిస్తోంది? భయంతో ఒళ్లు గగుర్పొడుస్తోంది కదూ! ఈ రెండు కోణాలు ఒకరివే. కేఫ్‌ కాఫీ డే సీఈఓ మాళవిక హెగ్దే.. అనుకోని కష్టాలు ఎదురైనా.. తను నిలబడి, సంస్థనూ ముందుకు నడుపుతున్నారు. మాళవిక పుట్టి పెరిగిందంతా బెంగళూరే. ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్‌. నాన్న ఎస్‌ఎం కృష్ణ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. భిక్షాటనతో మనవరాలిని కిక్‌ బాక్సర్‌ను చేసిన హిజ్రా

కృషి, పట్టుదల... అంతకు మించిన సంకల్పం ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదని ఓ హిజ్రా నిరూపించారు. వరుసకు మనవరాలు అయిన బాలికను భిక్షాటన ద్వారా సేకరించిన మొత్తంతో కిక్‌ బాక్సర్‌గా చేసిన ఘనత మైసూరుకు చెందిన అక్రం పాషా అలియాస్‌ షబానాదే. నగరంలోని సెయింట్‌ ఆంథోని ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బీబీ ఫాతిమా ఆసక్తిని గుర్తించిన షబానా... కిక్‌ బాక్సింగ్‌ శిక్షణ కోసం చేయూత ఇవ్వడం విశేషం.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Rishabh Pant: పంత్‌.. ఇంతేనా?

‘‘అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి పంత్‌కు విరామం ఇవ్వాలి’’.. ‘‘అది పంత్‌ సహజ శైలి ఆటతీరని పనికిరాని మాటలు మాట్లాడొద్దు’’.. ఇవీ దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో టీమ్‌ఇండియా ఓటమి అనంతరం పంత్‌ వైఫల్యంపై వినిపిస్తున్న విమర్శలు. జట్టును ఆదుకోవాల్సిన పరిస్థితుల్లో.. పేలవ షాట్లు ఆడి వికెట్‌ పారేసుకున్న అతని ఆటతీరుపై మాజీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధోని వారసుడిగా జట్టులో అడుగుపెట్టి.. కొన్ని కీలక ఇన్నింగ్స్‌లతో జట్టు అద్భుత విజయాల్లో ప్రధాన పాత్ర పోషించిన పంత్‌.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. AP news: సాఫ్ట్‌వేర్‌ కొలువు.. సులువే!

ఐటీ నియామకాల్లో ట్రెండ్‌ పూర్తి స్థాయిలో మారుతోంది. ఇంజినీరింగ్‌లో కంప్యూటర్‌ సైన్సు (సీఎస్‌ఈ) చదవాలి.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం సంపాదించాలనే విధానానికి భిన్నంగా ఏ బ్రాంచి చదివినా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి. కెమికల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థికీ అవకాశం దక్కడం గమనార్హం. వివిధ కంపెనీలు బ్రాంచులను పట్టించుకోకుండా అభ్యర్థుల నైపుణ్యాలనే పరీక్షిస్తున్నాయి. కోర్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచుల్లోని సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ (ఈఈఈ) కోర్సులు చదువుతున్న వారూ తమను తాము మార్చుకుని ప్రాంగణ ఉద్యోగాలను సాధిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* వైరస్‌ని చదివేద్దాం... కొలువులు పట్టేద్దాం!

5. యూపీలో మామిడి వైన్‌!

ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రజలకు త్వరలో మామిడి వైన్‌ (మ్యాంగో వైన్‌) అందుబాటులోకి రానుంది. ఇందుకోసం ప్రత్యేకంగా మద్యం విధానాన్ని సవరించాలని యూపీ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ ప్రతిపాదన పంపింది. 1974 తర్వాత రాష్ట్రంలో మద్యం విధానాన్ని సవరించాల్సి రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మామిడి వైన్‌ తయారీ యూనిట్లను రాష్ట్రంలోనే ఏర్పాటు చేయొచ్చని ఎక్సైజ్‌ శాఖ చెబుతోంది. రూ.70 లక్షలతో ఒక యూనిట్‌ ఏర్పాటవుతుందని అంచనా. సాధారణంగా వైన్‌ తయారీకి ద్రాక్ష పండ్లు ఉపయోగిస్తారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఫ్రిజ్‌లు-ఏసీల ధరలు 5-10 శాతం ప్రియం!

ఎయిర్‌ కండీషనర్లు (ఏసీ), రిఫ్రిజరేటర్లు, వాషింగ్‌ మెషీన్ల ధరలు 5-10 శాతం మేర పెరిగే అవకాశం ఉంది. ముడి పదార్థాల ధరలతో పాటు రవాణా ఛార్జీలు అధికం కావడంతో, ఆ భారాన్ని కొనుగోలుదార్లకు బదలాయించేందుకు కంపెనీలు సిద్ధపడ[ుతుండటమే ఇందుకు కారణం. ఎల్‌జీ, పానసోనిక్‌, హైయర్‌ వంటి కంపెనీలు ఇప్పటికే ధరలను కొంతమేర పెంచగా.. సోని, గోద్రేజ్‌ వంటి కంపెనీలు  నిర్ణయం తీసుకునేందుకు వేచిచూస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Cinema News: కొత్త అందాల... సరికొత్త ఆశలు

కొత్త సినీ క్యాలెండర్‌ తెరచుకుందంటే చాలు.. అగ్ర తారల సందడి ఎలా ఉండనుంది? స్టార్‌ నాయికల జోరు ఎలా సాగనుంది? యువ హీరోల వేగం ఎలా ఉంటుంది? అంటూ ఆరాలు మొదలైపోతాయి. ఇక కొత్త అందాలు తెరపై వచ్చి వాలనున్నాయని తెలిస్తే చాలు.. సినీప్రియుల దృష్టంతా ఆవైపే వెళ్లిపోతుంది. కొత్త ఏడాదిలో మురిపించే ఆ తారలెవరు? వారి సినిమాల విశేషాలేమిటీ? అంటూ ఆరాలు తీస్తుంటారు. 2022లో తెలుగు తెరపై కాలుమోపుతున్న కొత్త అందాల జాబితా పెద్దగానే ఉంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. న్యూయార్క్‌లో ఘోర అగ్నిప్రమాదం: 19 మంది మృతి

అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.  అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగి 19 మంది మృతిచెందారు. మృతుల్లో 9 మంది పిల్లలు కూడా ఉన్నారు. సుమారు 60 మంది గాయపడ్డట్లు సమాచారం. గాయపడినవారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. వీరిలో 13 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. 19 అంతస్తులున్న అపార్ట్‌మెంట్‌లో రెండు, మూడు అంతస్తులకు మంటలు చెలరేగాయి. దీంతో అపార్ట్‌మెంట్‌లో మొత్తం పొగచూరింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Advertisement: వధువు కోసం భారీ హోర్డింగ్‌తో ప్రకటన

బ్రిటన్‌లో ఉంటున్న పాకిస్థాన్‌ జాతీయుడు మహమ్మద్‌ మాలిక్‌.. తన జీవిత భాగస్వామిని వెతుక్కునేందుకు బిల్‌బోర్డ్‌లను ఆశ్రయించాడు. ‘నాకు సరిజోడి చూసిపెట్టండి’ అంటూ ప్రకటనలు ఇచ్చాడు. ‘పెద్దలు కుదిర్చే పెళ్లి నుంచి కాపాడండి’ అంటూ పెద్ద అక్షరాలతో ఉన్న హోర్డింగ్‌ను చూసి స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. లండన్‌, బర్మింగ్‌హామ్‌ నగరాల్లో ఈ బిల్‌బోర్డ్‌ ప్రకటన ఇచ్చాడు. తొలుత ఇదేదో ప్రాంక్‌ అయి ఉంటుందని అంతా భావించారు. లేదా సాధారణ ప్రకటనే అనుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. 119 ఏళ్ల బామ్మ.. ఆరోగ్య పాఠాలివీ!

రెండు పదులు దాటితే అనారోగ్యాల చిట్టా విప్పేస్తున్న కాలమిది! కానీ జపాన్‌కు చెందిన ఒక బామ్మ మాత్రం తన ఆరోగ్యంతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ ఆమె వయసెంతో తెలుసా? ఇటీవలే తన 119వ పుట్టినరోజును జరుపుకొని, ప్రపంచంలోనే వృద్ధమహిళగా గిన్నిస్‌ రికార్డునూ సాధించింది. తన ఆరోగ్య రహస్యాన్ని అందరితో పంచుకుంది. అవేంటో.. చదివేయండి. కనే తనాకా 1903లో జన్మించింది. తొమ్మిదిమంది తోబుట్టువుల్లో ఈమెది సరిగా మధ్యస్థానం.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

అక్షర బోధన వదిలి గానుగ సాధన

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని