ఫ్రిజ్‌లు-ఏసీల ధరలు 5-10 శాతం ప్రియం!

ఎయిర్‌ కండీషనర్లు (ఏసీ), రిఫ్రిజరేటర్లు, వాషింగ్‌ మెషీన్ల ధరలు 5-10 శాతం మేర పెరిగే అవకాశం ఉంది. ముడి పదార్థాల ధరలతో పాటు రవాణా ఛార్జీలు అధికం కావడంతో, ఆ భారాన్ని కొనుగోలుదార్లకు

Updated : 10 Jan 2022 09:17 IST

కంపెనీల సన్నాహాలు

దిల్లీ: ఎయిర్‌ కండీషనర్లు (ఏసీ), రిఫ్రిజరేటర్లు, వాషింగ్‌ మెషీన్ల ధరలు 5-10 శాతం మేర పెరిగే అవకాశం ఉంది. ముడి పదార్థాల ధరలతో పాటు రవాణా ఛార్జీలు అధికం కావడంతో, ఆ భారాన్ని కొనుగోలుదార్లకు బదలాయించేందుకు కంపెనీలు సిద్ధపడుతుండటమే ఇందుకు కారణం. ఎల్‌జీ, పానసోనిక్‌, హైయర్‌ వంటి కంపెనీలు ఇప్పటికే ధరలను కొంతమేర పెంచగా.. సోని, గోద్రేజ్‌ వంటి కంపెనీలు  నిర్ణయం తీసుకునేందుకు వేచిచూస్తున్నాయి. సాధారణంగా వేసవికి ముందు జనవరి-మార్చిలో ఎలక్ట్రానిక్‌ గృహోపకరణాల ధరలను కంపెనీలు 5-7 శాతం పెంచుతుంటాయని కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ అప్లయన్సెస్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ (సీమా) ప్రెసిడెంట్‌ ఎరిక్‌ బ్రగాంజా తెలిపారు. 

కంపెనీల వారీగా

ఉత్పత్తుల తయారీలో వినియోగించే లోహాలు, ఇతర ముడిపదార్థాల ధరలు అనూహ్యంగా పెరగడం, అంతర్జాతీయంగా రవాణా ఛార్జీలు భారం కావడం వల్ల ఏసీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌మెషీన్ల ధరలను 3-5% పెంచినట్లు హైయర్‌ అప్లయన్సెస్‌ ఇండియా ప్రెసిడెంట్‌ సతీశ్‌ ఎన్‌.ఎస్‌. తెలిపారు. ఏసీల ధరలను 8% వరకు పెంచిన పానసోనిక్‌, మళ్లీ ధరలను సవరించాలని చూస్తోంది. ఇతర గృహోపకరణాలకూ ఇదే వర్తింప చేస్తామని పానసోనిక్‌ ఇండియా డివిజినల్‌ డైరెక్టర్‌ ఫుజిమోరి వెల్లడించారు. వ్యాపార సుస్థిరత కోసం ధరలు పెంచక తప్పడం లేదని ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ దీపక్‌ బన్సల్‌ వివరించారు. అల్యూమినియం, రిఫ్రిజరెంట్స్‌పై యాంటీ డంపింగ్‌ సుంకాల భారం వల్ల ధరలు 2-3% పెంచాల్సి వస్తున్నట్లు హిటాచీ ఎయిర్‌ కండీషనింగ్‌ ఇండియా సీఎండీ గుర్మీత్‌ సింగ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని