Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 13 May 2022 09:11 IST

1. Chennai: చెన్నైకు డీఆర్‌ఎస్‌ దెబ్బ..

 అంపైర్‌ తప్పిదం, డీఆర్‌ఎస్‌ పని చేయకపోవడం చెన్నై కొంప ముంచాయి. తొలి ఓవర్‌ రెండో బంతికే కాన్వేను కోల్పోయిన ఆ జట్టు ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. సామ్స్‌ బౌలింగ్‌లో కాన్వేను అంపైర్‌ ఎల్బీగా ప్రకటించాడు. కానీ బంతి లెగ్‌సైడ్‌ వెళ్లేదన్నది స్పష్టం. బ్యాట్స్‌మన్‌కు సమీక్ష కోరే అవకాశం లేకపోయింది. సాంకేతిక సమస్య వల్ల డీఆర్‌ఎస్‌ అందుబాటులో లేదని అంపైర్లు చెప్పడంతో కాన్వే నిరాశగా వెనుదిరిగాడు. రెండో ఓవర్లో ఎల్బీగా వెనుదిరిగిన ఉతప్పకు కూడా సమీక్ష కోరే అవకాశం లేకపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ప్రతి ఆరుగురిలో ఒకరికి..

భారతీయుల్లో ప్రతి ఆరుగురిలో ఒకరు మధుమేహ బాధితులు కావొచ్చని సీసీఎంబీ శాస్త్రవేత్తలు అంటున్నారు. టైప్‌-2 మధుమేహానికి జన్యువులు ఎలా దోహదం చేస్తున్నాయో తెలుసుకునేందుకు జనాభా నిర్దిష్ట జన్యుపర వ్యత్యాసాలపై పరిశోధకులు అధ్యయనం చేశారు. విభిన్న వర్గాల జనాభాపై ప్రపంచవ్యాప్త అధ్యయనం చేపట్టారు. ఇప్పటివరకు ఈ తరహా అధ్యయనాలు ఎక్కువగా యూరోపియన్‌ పూర్వీకుల జనాభాపై చేపట్టారు. అయితే ఇటీవలి కాలంలో మధుమేహ ముప్పును దక్షిణాసియా, భారత్‌, చైనాలు ఎక్కువగా ఎదుర్కొంటున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Hyderabad: యూట్యూబ్‌ ప్రాంక్‌స్టర్‌ శ్రీకాంత్‌రెడ్డిపై కరాటే కల్యాణి దాడి

3.  ఇదే మహాబిలం

మన పాలపుంత నడిబొడ్డున ఉన్న భారీ కృష్ణబిలం ‘శాజిటేరియస్‌-ఎ’ తొలి చిత్రాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు గురువారం ఆవిష్కరించారు. ‘ఈవెంట్‌ హొరైజన్‌ టెలిస్కోప్‌ (ఈహెచ్‌టీ) కొలాబ్రేషన్‌’గా ఏర్పడిన అంతర్జాతీయ పరిశోధన బృందం... ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని రేడియో టెలిస్కోప్‌లను ఉపయోగించి భూ పరిమాణంలో ‘వర్చువల్‌ టెలిస్కోప్‌’ను రూపొందించింది. దీన్ని ఉపయోగించి 2017లో అనేక నిశి రాత్రుల్లో ‘శాజిటేరియస్‌-ఎ’ లక్ష్యంగా ఖగోళ శాస్త్రవేత్తలు డేటా సేకరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఇంటర్‌ పరీక్షల్లో మరో తప్పు

ఇంటర్‌ పరీక్షల సందర్భంగా బోర్డు దోషాలు దొర్లుతూనే ఉన్నాయి. ప్రశ్నపత్రాల్లో రోజుకో కొత్త తరహా తప్పులు వస్తున్నాయి. ఫలితంగా విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. ప్రశ్నపత్రాల రూపకల్పనలో ఇంటర్‌బోర్డు ఈసారి తీవ్ర నిర్లక్ష్యం చూపినట్లు స్పష్టమవుతోంది. ద్వితీయ ఇంటర్‌ విద్యార్థులకు గురువారం గణితం, వృక్షశాస్త్రం, రాజనీతిశాస్త్రం సబ్జెక్టుల పరీక్షలు జరిగాయి. మాధ్యమం ఏదైనా ప్రశ్నలు ఒకటే ఉంటాయి. ఈసారి మాత్రం రాజనీతి శాస్త్రంలో ఒక ప్రశ్న ఆంగ్ల మాధ్యమంలో ఒకటి ఉండగా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. తొమ్మిది సార్లు బయోమెట్రిక్‌ పరిశీలన

నియామకాల్లో ఈసారి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఉన్నతాధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించబోతున్నారు. సుమారు 17 వేల పోస్టుల భర్తీ నేపథ్యంలో తొలిదశ నుంచే అక్రమాలకు ఆస్కారమివ్వకూడదనే కృతనిశ్చయంతో ఉన్నారు. గతంలో ఒక అభ్యర్థి స్థానంలో మరొకరు ఎంపిక ప్రక్రియలో పాల్గొన్న దాఖలాలుండటంతో అలాంటి తప్పిదాలకు తావివ్వకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Jobs: కొలువులకు ప్రాంగణం

6ఇంటికో బుజ్జాయే!
నలభై, యాభై ఏళ్ల క్రితం గంపెడు సంతానం ఉండటం గొప్ప.. రెండు మూడు దశాబ్దాల క్రితం అది ఇద్దరు, ముగ్గురు చాలనే దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఒక్కరే చాలు అనే దగ్గర ఆగిపోతోంది. దీనివల్ల కుటుంబాల్లో పిల్లల సంఖ్య తగ్గిపోతోంది. రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ పాటిస్తున్నవారి సంఖ్య మరీ ఎక్కువైనట్లు కనిపిస్తోంది. సగటున రాష్ట్రంలోని ప్రతి 10 కుటుంబాలకు పిల్లలు 17 మందే ఉంటున్నారు. ఈ సంఖ్య మరీ తగ్గకుండా చూడాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Home appliances: పెరగనున్న ఏసీలు, ఫ్రిజ్‌ల ధరలు

టీవీలు, వాషింగ్‌మెషీన్లు, రిఫ్రిజరేటర్లు, ఎయిర్‌ కండీషనర్ల ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉంది. ఈ నెలాఖరు లేదా జూన్‌ మొదటివారంలోనే వీటి ధరలను 3-5 శాతం పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ‘ఇప్పటికే ముడి పదార్థాల ధరలు పెరిగాయి. డాలర్‌ విలువ పెరిగిపోవడంతో, దిగుమతి చేసుకుంటున్న విడిభాగాలకు మరింత మొత్తం చెల్లించాల్సి వస్తోంది. అందువల్ల ఎలక్ట్రానిక్స్‌ పరికరాల ధరలను త్వరలోనే 3-5 శాతం పెంచాల్సి రావొచ్చ’ని.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. YSRCP: రాజ్యసభకు వైకాపా నుంచి రేసులో ఎవరు?

వైకాపా పార్లమెంటరీ పార్టీ నేతగా వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని వైకాపా మరోమారు పొడిగించనుంది. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఎమ్మెల్యేల సంఖ్యాబలం పరంగా చూస్తే ఈ నాలుగు సీట్లూ వైకాపాకే దక్కనున్నాయి. ఈ నలుగురిలో విజయసాయిరెడ్డి పదవి జూన్‌లో ముగియనున్నప్పటికీ ఆయన్ను మరోసారి రాజ్యసభకు పంపేందుకు ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయించినట్లు తెలిసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* 30 ఏళ్లుగా ఆమె అతడుగా..

9. ఈసారి కాస్త ముందుగానే నైరుతి!

ఈసారి నైరుతి రుతు పవనాలు కాస్త ముందుగానే పలకరించే అవకాశాలున్నాయి. అండమాన్‌, నికోబార్‌ దీవుల్లో ఈ నెల 15న ఈ సీజన్‌ తొలి వర్షాలు కురవొచ్చని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) గురువారం తెలిపింది. మే 15కల్లా నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్‌ సముద్ర ప్రాంతం, దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని ఐఎండీ ఓ ప్రకటనలో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కార్డుతో పెరిగేను స్కోరు...

క్రెడిట్‌ కార్డులు.. ఇప్పుడు నిత్యావసరంగా మారింది. అత్యవసరాల్లో డబ్బు లేకున్నా.. అవసరాన్ని తీర్చుకునేందుకు ఇది సహాయం చేస్తుంది. నిజానికి ఇవి రెండు వైపులా పదునున్న కత్తుల్లాంటివి. కొద్దిగా క్రమశిక్షణ తప్పినా.. అప్పుల ఊబిలోకి నెట్టేస్తాయి. దీంతోపాటు క్రెడిట్‌ స్కోరునూ తగ్గించేస్తాయి. జాగ్రత్తగా వాడితే.. జీవన శైలిని పెంచుకునేందుకు తోడ్పడటంతోపాటు, క్రెడిట్‌ స్కోరును పెంచుకునేందుకూ తోడ్పడతాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని